OTT Real: ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ- తెలుగుతో సహా 7 భాషల్లో!

Inspector Avinash Season 2 OTT Streaming: 150 ఎన్‌కౌంటర్లు చేసిన సూపర్ పోలీస్ అవినాష్ మిశ్రా రియల్ స్టోరీగా తెరకెక్కిన ఇన్‌స్పెక్టర్ అవినాష్ సిరీస్ నుంచి రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగుతోపాటు 7 భాషల్లో ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2 ఓటీటీ రిలీజ్ అయింది. మరి అది ఎక్కడో లుక్కేద్దాం.

Published on: May 16, 2026, 13:44:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Inspector Avinash Season 2 OTT Release Telugu: బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రణదీప్ హుడా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రేజీ ఓటీటీ వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ అవినాష్'. ఐఎమ్‌డీబీలో పదికి 7.6 రేటింగ్‌తో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్‌కు సరికొత్తగా రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ- తెలుగుతో సహా 7 భాషల్లో!
ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్- 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ- తెలుగుతో సహా 7 భాషల్లో!

రౌడీల బెడద వదిలించే

టాలీవుడ్‌లో 'గబ్బర్ సింగ్', 'క్రాక్' వంటి పవర్‌ఫుల్ పోలీస్ కథలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఖాకీ చొక్కా వేసి రౌడీల బెడద వదిలించే కమర్షియల్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అదే తరహాలో పక్కా రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 ఓటీటీలోకి హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రావడం విశేషం.

కెరీర్‌లోనే అత్యుత్తమ నటన

"రణదీప్ హుడా తన కెరీర్‌లోనే అత్యుత్తమ నటన కనబర్చారు" అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కొనియాడుతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2కు డైరెక్టర్ నీరజ్ పాఠక్ దర్శకత్వం వహించారు.

150 ఎన్‌కౌంటర్ల పోలీస్ రియల్ స్టోరీ

ఓటీటీ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం కల్పిత కథ కాదు. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో గ్యాంగ్‌స్టర్ల గుండెల్లో నిద్రపోయిన రియల్ సూపర్‌కాప్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అవినాష్ మిశ్రా నిజ జీవిత ఆధారంగా దీనిని తెరకెక్కించారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 150 మంది కరడుగట్టిన మాఫియా డాన్లు, రౌడీలను ఎన్‌కౌంటర్ చేసిన రికార్డు అవినాష్ మిశ్రా సొంతం. 1997 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కడుతూ, ఒక భారీ ఆయుధాల ముఠాను (Weapons Cartel) పట్టుకోవడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అవినాష్ చేసిన సాహసోపేతమైన పోరాటాన్ని ఈ రెండో సీజన్‌లో చూపించారు.

తెలుగుతో పాటు 7 భాషల్లో..

మొత్తం 10 ఎపిసోడ్లతో రూపొందిన ఈ రెండో సీజన్‌ను జియో హాట్‌స్టార్ భారీ స్థాయిలో విడుదల చేసింది. మే 15 అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ వంటి మొత్తం 7 భాషల్లో ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2 ఓటీటీ రిలీజ్ అయింది.

మొత్తం 10 ఎపిసోడ్లు

ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిన్నింటిని ఒకేసారి ఓటీటీ ప్రీమియర్‌లో వదిలారు. ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించేలా టైటిళ్లను డిజైన్ చేశారు. ఎపిసోడ్ 1 - షడ్యంత్ర, ఎపిసోడ్ 2 - వ్యవస్థ, ఎపిసోడ్ 3 - లక్ష్మణ రేఖ, ఎపిసోడ్ 4 - అసుర భాగ్ 1, ఎపిసోడ్ 5 - అసుర భాగ్ 2, ఎపిసోడ్ 6 - విశ్వాసఘాత్, ఎపిసోడ్ 7 - మహారథి, ఎపిసోడ్ 8 - armament / యుద్ధ విరామం, ఎపిసోడ్ 9 - తఖ్తా పలట్, ఎపిసోడ్ 10 - మహాభారత్‌గా పెట్టారు.

జోడీగా ఊర్వశి రౌటేలా

ఈ ఓటీటీ సిరీస్‌లో రణదీప్ హుడాకు జోడీగా ఊర్వశి రౌటేలా నటించగా.. అమిత్ సియాల్, అభిమన్యు సింగ్, జాకీర్ హుస్సేన్, రజనీష్ దుగ్గల్, ఫ్రెడ్డీ దారువాలా వంటి ప్రతిభావంతులైన నటీనటులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

జియో హాట్‌స్టార్ ఓటీటీలో

క్రైమ్ అంశాలతో యాక్షన్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి, వీకెండ్‌లో హోమ్ థియేటర్లలో కూర్చుని వినోదాన్ని ఆస్వాదించడానికి జియో హాట్‌స్టార్ ఓటీటీలోని ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More