హైదరాబాద్‌లో పిల్లలను స్కూల్‌లో దింపి రావాలన్నా ట్రాఫిక్‌తో చిరాకు. అలా బయటకు వెళ్లి వద్దామనుకున్నా.. గంటలు గంటలు ట్రాఫిక్‌లోనే ఇరిటేషన్. దీంతో జనాలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. అందులో నుంచి వచ్చినదే 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్.

ఈ 15 మినిస్ట్ సిటీ కాన్సెప్ట్‌లో కేవలం 15 నిమిషాల దూరంలో కార్యాలయాలు, మార్కెట్లు, మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్, స్కూళ్లు ఉంటాయి. ఇక్కడకు సైక్లింగ్ లేదా కాలి నడకన చేరుకుంటారు. ట్రాఫిక్‌లో కోల్పోయిన గంటల జీవితాన్ని ఈ కాన్సెప్ట్ ద్వారా సేవ్ చేసుకోవచ్చన్నమాట.
కొత్త రకం ప్రాజెక్టులపై ఫోకస్
వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న మౌలిక సదుపాయాల సవాళ్లతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు కస్టమర్లను ఆకర్శించేందుకు ఇలాంటి కొత్త రకం ప్రాజెక్టులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఇలాంటి కాన్సెప్ట్‌లు గృహాలను కార్యాలయాలు, మార్కెట్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వినోదంతో కనెక్ట్ చేస్తాయి. అన్నీ నడక లేదా సైక్లింగ్ దూరంలోనే ఉంటాయి. ఇళ్ల కొనుగోలుదారులు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలు, కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు.
కరోనా తర్వాత మార్పు
కరోనా తర్వాత.. నివాస ప్రాంతాల్లో వెల్‌నెస్ సెంటర్లు, ఫిజియోథెరపీ స్టూడియోలు, ప్లే స్కూల్‌లు, పార్కులకు డిమాండ్ పెరిగింది. పర్యావరణ అవగాహన కూడా పెరిగింది. కొనుగోలుదారులు ఎత్తైన ప్రాజెక్టుల కంటే పచ్చని పరిసరాలు, బహిరంగంగా నడిచే స్థలాలను ఉండటాన్ని ఇష్టపడుతున్నారనేది కాదనలేని సత్యం. ఒక కిలోమీటరు పరిధిలోనే రోజువారీ నిత్యావసరాలు ఉండాలి, వీకెండ్‌లో వినోదం దొరకాలి.
నివాస ప్రాంతాలకు దగ్గరగా
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేసేవారు కూడా పచ్చదనం ఉండేలా చూస్తున్నారు. రిటైల్, ఎంటర్టైన్‌మెంట్ జోన్స్ నివాస ప్రాంతాలకు దగ్గరగా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో అక్కడకు చేరుకునేందుకు ప్రయాణ సమయం 15-20 నిమిషాలు పడుతుంది. గతంలో హైదరాబాద్ అంటే.. నివాస ప్రాంతాలు ఒకచోట, ఆఫీసులు మరొక చోట ఉండేవి. అంతేకాదు వినోదం కోసం ఎక్కడికైనా వెళ్లాలి అంటే టైమ్ పట్టేది. కానీ ఇప్పుడు అన్నీ ఒకే చోట ఉండేలా ప్లాన్స్ చేస్తున్నారు.
కోవిడ్-19 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ కాన్సెప్ట్ పెరుగుదల కంపెనీలు నివాసాలకు దగ్గరగా కార్యాలయ స్థలాలను పరిగణించేలా చేసింది. ప్రస్తుతం 60-70 శాతం మంది ఐటీ ఉద్యోగులు సిటీలోని వివిధ ప్రాంతాల నుండి హైటెక్ సిటీ ప్రాంతానికి ప్రతిరోజూ ప్రయాణిస్తున్నారని అంచనా. ఇది ట్రాఫిక్ రద్దీ, అధిక కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతుంది. అందుకే హైదరాబాద్‌లో 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచింది.
15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్ అంటే?
{{/usCountry}}కోవిడ్-19 తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్ వర్క్ కాన్సెప్ట్ పెరుగుదల కంపెనీలు నివాసాలకు దగ్గరగా కార్యాలయ స్థలాలను పరిగణించేలా చేసింది. ప్రస్తుతం 60-70 శాతం మంది ఐటీ ఉద్యోగులు సిటీలోని వివిధ ప్రాంతాల నుండి హైటెక్ సిటీ ప్రాంతానికి ప్రతిరోజూ ప్రయాణిస్తున్నారని అంచనా. ఇది ట్రాఫిక్ రద్దీ, అధిక కార్బన్ ఉద్గారాలకు కారణం అవుతుంది. అందుకే హైదరాబాద్‌లో 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్‌పై ఆసక్తిని పెంచింది.
15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్ అంటే?
{{/usCountry}}15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్ నడక లేదా సైక్లింగ్ చేసేంత దూరంలోనే పని, విద్య, ఆరోగ్య సంరక్షణ(ఆసుపత్రులు), విశ్రాంతి, వినోదం చుట్టూ ఉండేలా ప్లానింగ్ ఉంటుంది. నివాసితులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడకుండా, ఇంధన వినియోగం అవసరం లేకుండా గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో రోజువారీ అవసరాలను తీర్చుకోవచ్చు. ట్రాఫిక్, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు అన్నింటికీ దగ్గరలో బతకడం ఈ కాన్సెప్ట్ ప్రధాన ఉద్దేశం.
ఈ ప్రాజెక్టులు ఎక్కడ పుట్టుకొస్తున్నాయి?
ఓ నివేదిక ప్రకారం ఈస్ట్, వెస్ట్ సైడ్ ఈ ట్రెండ్ ఎక్కువగా వస్తుంది. 39 శాతం పశ్చిమ హైదరాబాద్‌లో, తరువాత 32 శాతం నగరంలోని దక్షిణ ప్రాంతాలలో ఈ విధానం కనిపిస్తోంది. కొండాపూర్, మణికొండ, నర్సింగ్గి, తెల్లాపూర్, నియోపోలిస్, మోకిలా, కొల్లూరు, కోకాపేట వంటి ప్రాంతాలు మినీ నగరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి వంటి పశ్చిమ కారిడార్ నుండి తూర్పు వైపు ఐటీ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఉప్పల్, పోచారం, ఎల్‌బీ నగర్‌లలో ఇది జరుగుతోంది. దీంతో 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్ ప్రాధాన్యత పెరుగుతుంది.
ఇందులో భాగంగా నివాస ప్రాంతాల్లో పచ్చని ప్రదేశాలు ఉంటాయి. నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, సమర్థవంతమైన ప్రజా రవాణాపై ఉండేలా ప్లాన్ ఉంటుంది. కిలోమీటరులోపు పని ప్రదేశాలు, దుకాణాలు, పాఠశాలలు, పార్కులు, ఆసుపత్రులు ఉండేలా ప్రణాళిక చేస్తారు. కార్లు, బైక్‌ల కంటే నడక లేదా సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఈ కాన్సెప్ట్ ట్రాఫిక్, ఉద్గారాలను తగ్గించడంతోపాటుగా శారీరక శ్రమ, మానసిక శ్రేయస్సును మెరుగుపరచడం, మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.