హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం (Balapur Ganesh Laddu Auction) ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ నడుమ సాగిన ఈ వేలం పాటలో బాలాపూర్ లడ్డూ రికార్డు స్థాయిలో రూ.39 లక్షల ఆల్‌టైమ్ హై ధరకు అమ్ముడుపోయింది. వనస్థలిపురంలోని సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డి ఈ విశిష్టమైన లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు.

వినాయక నిమజ్జనం రోజున ఎంతో కోలాహలంగా జరిగే ఈ వేలం పాటలో పాల్గొనేందుకు మొత్తం 8 మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రారంభం నుంచే తీవ్ర పోటీ నెలకొంది. చివరికి సామ ప్రణీత్‌రెడ్డి రూ.39 లక్షలు పలికి లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూను దక్కించుకున్న అనంతరం ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ.. లంబోదరుడి ఆశీస్సులు తన కుటుంబంతో పాటు సమాజానికీ లభించాలని ఆకాంక్షించారు.
బాలాపూర్ గణేశుడి చేతిలోని 21 కిలోల లడ్డూ ప్రసాదానికి భక్తులలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ లడ్డూను పొందితే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, వ్యాపారవృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. దక్కించుకున్న లడ్డూను కుటుంబ సభ్యులు, బంధువులకు పంచి, కొంత భాగాన్ని పొలాల్లో చల్లితే పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం.
45 ఏళ్ల ఘన చరిత్ర
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి 45 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. అయితే లడ్డూ వేలం పాట పద్ధతి 1994లో ప్రారంభమైంది. తొలి వేలం (1994) స్థానిక రైతు కొలను మోహన్‌రెడ్డి మొదటిసారిగా కేవలం రూ.450కే లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఆయన జీవితంలో సాధించిన పురోగతితో ఈ వేలానికి విశేష ప్రజాదరణ లభించింది. మొదటి 15 ఏళ్ల పాటు కేవలం స్థానికులకే పరిమితమైన వేలం పాటను 2009 నుంచి బయటి వ్యక్తులకు కూడా విస్తరించారు. ఆ ఏడాదే సరిత అనే మహిళ రూ.5.10 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.
31 ఏళ్ల వేలం చరిత్రలో ఒక్క 2020లో మాత్రమే కరోనా నిబంధనల వల్ల వేలం నిర్వహించలేదు. అప్పట్లో ఈ లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.
{{/usCountry}}31 ఏళ్ల వేలం చరిత్రలో ఒక్క 2020లో మాత్రమే కరోనా నిబంధనల వల్ల వేలం నిర్వహించలేదు. అప్పట్లో ఈ లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.
{{/usCountry}}1994కొలను మోహన్‌రెడ్డి రూ.450. 2009సరిత (బయటి వ్యక్తులకు మొదటిసారి) రూ.5.10 లక్షలు, 2023 లింగాల దశరథ్‌గౌడ్ రూ.35 లక్షలు,2024 కొలను శంకర్‌రెడ్డిరూ.30.01 లక్షలు, ప్రస్తుతం సామ ప్రణీత్‌రెడ్డి రూ.39 లక్షలు (ఆల్‌టైమ్ రికార్డు) ధర పలికింది. గతేడాది రూ.35 లక్షలతో పోలిస్తే ఈసారి ఏకంగా రూ.4 లక్షలు అధికంగా పలకడం విశేషం.