యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతుండగా…. మార్చి 6వ తేదీతో గడువు ముగుస్తుంది. అప్లికేషన్ హార్డ్ కాపీని మార్చి 10వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తారు. వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి. బ్యాక్ లాగ్ లో మిగిలిన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ (లెవల్-14) పోస్టులు 17 ఉండగా.. అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్-13A) ఖాళీలు 20, అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెవల్-10) ఉద్యోగాలు 3 ఉన్నాయి. పీహెచ్‌డీ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. రీసెర్చ్ లో మంచి పట్టు ఉండటంతో పాటు టీచింగ్ లో కూడా మంచి అనుభవం ఉండాలి. పబ్లికేషన్స్ కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 65ఏళ్ల మధ్య ఉండాలి.
HCUలో ఉద్యోగాలు - అప్లికేషన్ ప్రాసెస్
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://uohyd.ac.in/ వెబ్ సైట్ ను చూడాలి. కెరీర్ సెక్షన్ లోని ఫ్యాక్టలీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపించే ఆన్ లైన్ అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు కింద రూ. 1000 చెల్లించాలి.
HCU ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
- ఉద్యోగ నోటిఫికేషన్ - సెంట్రల్ యూనివర్శిటీ, హైదరాబాద్
- ఉద్యోగాలు -ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్-13A) , అసిస్టెంట్ ప్రొఫెసర్
- మొత్తం ఖాళీలు - 40
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పీజీ, పీహెచ్డీ ఉండాలి.
- ప్రొఫెసర్ పోస్టుకు ఎంపికైన వారికి రూ. 1,44,200 నుంచి రూ. 2,18,200 మధ్య నెల జీతం ఇస్తారు. Associate Professor కు రూ. 1,31,400 నుంచి రూ. 2,17,100, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికైన వారికి రూ. 57,700 నుంచి 1,82,400 జీతం ఇస్తారు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులకు చివరి తేదీ - 6 మార్చి 2026
- హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ - 10 మార్చి 2026
- హార్డ్ కాపీ పంపాల్సిన చిరునామా - ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్ మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్శిటీ ఆప్ హైదరాబాద్, గచ్చిబౌలి, హైదరాబాద్ - 500 046, తెలంగాణ.
- అధికారిక వెబ్ సైట్ - https://uohyd.ac.in/