హైదరాబాద్ నగరంలోని ఫుడ్, గ్రాసరీ డెలివరీ బాయ్స్ (గిగ్ వర్కర్లు) ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి, అసంబద్ధమైన టార్గెట్లపై అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO - International Labour Organisation) సంచలన విషయాలను బయటపెట్టింది. నావిగేషన్ యాప్స్ (గూగుల్ మ్యాప్స్ వంటివి) కనీసం 10 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుందని చూపించే ప్రయాణాలకు కూడా, డెలివరీ యాప్ సంస్థలు కేవలం 7 లేదా 8 నిమిషాల డెడ్‌లైన్ విధిస్తున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. ఇంతటి ఒత్తిడిలో ఏదైనా సమస్య వచ్చి ఆలస్యమైతే, తమ గోడు చెప్పుకోవడానికి కనీసం ఆయా కంపెనీల్లో మనుషులు కూడా అందుబాటులో ఉండటం లేదని నివేదిక స్పష్టం చేసింది.

భారతదేశంలో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ కార్మికులకు ఫిర్యాదుల పరిష్కారం, కార్మిక వివాదాల పరిష్కార యంత్రాంగాల అందుబాటుపై అవగాహన పేరుతో ఇటీవల ఈ నివేదిక విడుదలైంది. ఇందులో రైడ్-హెయిలింగ్ (క్యాబ్/బైక్ ట్యాక్సీ), డెలివరీ, హోమ్-సర్వీస్ కార్మికుల సమస్యలను అధ్యయనం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ చట్టం, 2026 అమలుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. కార్మికుల సంక్షేమం, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ చట్టాన్ని తెస్తున్నారు. అయితే కేవలం యాప్ కంపెనీలు నడిపే ఫిర్యాదుల వ్యవస్థపైనే ఆధారపడకుండా, బయట నుంచి కూడా కార్మికులు తమ సమస్యలను చెప్పుకుని పరిష్కరించుకునే సమర్థవంతమైన యంత్రాంగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఐఎల్‌ఓ సూచించింది.
తమ జీతాల్లో కోతలు, జరిమానాలు, సంపాదన లెక్కల గురించి యాప్ సంస్థలు ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని హైదరాబాద్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ లెక్కలను అర్థం చేసుకోవడానికి తోటి కార్మికులు, వాట్సాప్ గ్రూపులపైనే ఆధారపడుతున్నామని తెలిపారు.
యాప్‌లలోని ఆటోమేటెడ్ ఫిర్యాదుల వ్యవస్థలు చాలా కఠినంగా ఉంటున్నాయని, వ్యక్తిగత పరిస్థితులను అర్థం చేసుకునేలా లేవని నివేదిక పేర్కొంది. కస్టమర్లు ఫోన్ ఎత్తకపోయినా, అందుబాటులో లేకపోయినా ఆ ఆలస్యాన్ని కూడా డెలివరీ బాయ్స్ పనితీరు స్కోరులో మైనస్‌గా లెక్కిస్తున్నారని గిగ్ వర్కర్లు వాపోయారు. ఆర్డర్లు, ఇన్సెంటివ్‌లు ఎలా ఇస్తున్నారో తమకు అర్థం కాని రహస్యంలా ఉందని తెలిపారు.
కొద్దిమందికి మాత్రమే ఇన్సెంటివ్‌లు వస్తున్నాయని, కొందరికి వరుసగా ట్రిప్పులు వస్తుంటే, మరికొందరు గంటకు పైగా ఒక్క ఆర్డర్ కూడా రాక ఖాళీగా వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. పండుగల సమయంలో ఇన్సెంటివ్‌ల ఆశతో కొందరు డెలివరీ బాయ్స్ ఏకంగా 48 గంటల పాటు విరామం లేకుండా పనిచేస్తున్నారని, అయినా ఆర్డర్ల పంపిణీ ఎలా జరుగుతుందో వారికి తెలియదని ఓ కార్మికుడు వివరించాడు.
ఐఎల్ఓ ప్రధాన సూచనలు
{{/usCountry}}కొద్దిమందికి మాత్రమే ఇన్సెంటివ్‌లు వస్తున్నాయని, కొందరికి వరుసగా ట్రిప్పులు వస్తుంటే, మరికొందరు గంటకు పైగా ఒక్క ఆర్డర్ కూడా రాక ఖాళీగా వేచి చూడాల్సి వస్తోందని చెప్పారు. పండుగల సమయంలో ఇన్సెంటివ్‌ల ఆశతో కొందరు డెలివరీ బాయ్స్ ఏకంగా 48 గంటల పాటు విరామం లేకుండా పనిచేస్తున్నారని, అయినా ఆర్డర్ల పంపిణీ ఎలా జరుగుతుందో వారికి తెలియదని ఓ కార్మికుడు వివరించాడు.
ఐఎల్ఓ ప్రధాన సూచనలు
{{/usCountry}}గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఐఎల్‌ఓ పలు కీలక మార్పులను సూచించింది. కార్మికుల ఐడీలను బ్లాక్ లేదా డీయాక్టివేట్ చేసేటప్పుడు కచ్చితంగా మనుషుల పర్యవేక్షణ ఉండాలి. అన్యాయం జరిగితే అప్పీల్ చేసుకోవడానికి సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. చెల్లింపుల విధానంలో మార్పులు చేస్తే ముందుగానే కార్మికులకు స్పష్టంగా తెలియజేయాలి. యాప్ అల్గారిథమ్‌లు రోడ్లపై ట్రాఫిక్, ప్రతికూల వాతావరణం (వర్షం, ఎండ), కార్మికుల భద్రతను పరిగణనలోకి తీసుకుని డెలివరీ సమయాన్ని నిర్ణయించాలి.
హైదరాబాద్‌లో క్యాబ్/రైడ్-హెయిలింగ్ డ్రైవర్లతో 5 బృంద చర్చలు, డెలివరీ బాయ్స్‌తో 2 బృంద చర్చలు, ఒక హోమ్-సర్వీస్ కార్మికుడితో ముఖాముఖి నిర్వహించి ఈ వివరాలు సేకరించారు. అయితే ఇవి కేవలం ఈ చర్చల్లో పాల్గొన్న వారి అనుభవాలు మాత్రమేనని, మొత్తం కార్మికులందరి అభిప్రాయాలుగా భావించలేమని ఐఎల్‌ఓ స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం నగరాల్లో ఈ అధ్యయనం జరిగింది.