రాజధాని నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. నగరానికి గ్రావిటీ ద్వారా తాగునీటిని అందించే గండిపేట ప్రధాన కాండ్యూట్ మార్గంలో అతిగా నీటి లీకేజీలు ఏర్పడటంతో, వాటికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ పనుల కారణంగా నవంబర్ 3వ తేదీ ఉదయం నుంచి నవంబర్ 4వ తేదీ సాయంత్రం వరకు మొత్తం 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.

జలమండలి ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గండిపేట నీటి సరఫరా కాండ్యూట్ వ్యవస్థలో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల పరిధిలో భారీ లీకేజీలు గుర్తించారు. నీటి వృథాను అరికట్టడంతోపాటు సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ మరమ్మతులు తప్పనిసరిగా చేయాలి.
నవంబర్ 3వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి మరమ్మతు పనుల ప్రారంభం అవుతాయి. నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6:00 గంటలకు పనుల ముగిస్తారు. దీంతో పలు ముఖ్యమైన ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ 36 గంటల వ్యవధిలో హైదరాబాద్‌లోని ప్రధాన సర్కిళ్లు, వార్డులు, కాలనీలలో నీటి సదుపాయం అందుబాటులో ఉండదు.
గోషామహల్, కార్వాన్ సర్కిళ్లలోని రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, గన్‌ఫౌండ్రీ, అసెంబ్లీ, సెక్రటేరియట్ పరిసరాలు, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే కాలనీ ప్రాంతాలు, గోల్కొండ జోన్ పరిధిలోని చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్, కవాడిగూడ అండ్ జూబ్లీహిల్స్ సర్కిళ్లలోని కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ, బంజారాహిల్స్ వార్డు పరిధిలోని పలు ప్రధాన కాలనీల్లో నీటి సరఫరా 36 గంటలు నిలిచిపోనుంది.
సుదీర్ఘంగా తాగునీటి నిలిపివేత ఉండనున్నందున సంబంధిత ప్రాంతాల నివాసితులు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని వాటర్ బోర్డు సూచించింది. పనులు జరుగుతున్న సమయంలో నీటి వినియోగాన్ని పొదుపుగా చేసుకోవాలని, అనవసర వృథాను అరికట్టి అధికారులకు సహకరించాలని జలమండలి కోరింది. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.
{{/usCountry}}సుదీర్ఘంగా తాగునీటి నిలిపివేత ఉండనున్నందున సంబంధిత ప్రాంతాల నివాసితులు ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని వాటర్ బోర్డు సూచించింది. పనులు జరుగుతున్న సమయంలో నీటి వినియోగాన్ని పొదుపుగా చేసుకోవాలని, అనవసర వృథాను అరికట్టి అధికారులకు సహకరించాలని జలమండలి కోరింది. మరమ్మతు పనులు పూర్తయిన వెంటనే నీటి సరఫరాను యథావిధిగా పునరుద్ధరిస్తామని అధికారులు ప్రకటించారు.
{{/usCountry}}