డ్రంక్ డ్రైవ్ సందర్భంగా తాగుబోతులు చేసే పనులు ఎంత వింతగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఇలాగే హల్‌చల్ చేశాడు. పామును చూపిస్తూ.. ట్రాఫిక్ ఎస్సైని భయపెట్టించే ప్రయత్నం చేశాడు. తనపై కేసు నమోదు చేయవద్దని, తన ఆటోను ఇచ్చేయాలని బెదిరించాడు.

శనివారం రాత్రి హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు చేస్తున్నారు పోలీసులు. ఇదే సమయంలో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ట్రాఫిక్ ఎస్సై ఎం.ఎ కరీం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ సయ్యద్ ఇర్ఫాన్ మద్యం మత్తులో ఉన్నాడని అనుమానించిన ట్రాఫిక్ పోలీసు అధికారులు అతన్ని ఆపారు. డ్రైవర్‌కు బ్రీత్ అనలైజర్ పరీక్షలో 110 రీడింగ్ వచ్చింది. అతనిపై కేసు నమోదు చేశారు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఇక ఇర్ఫాన్ తన హంగామా మెుదలుపెట్టాడు. మెుదటగా కేసు వద్దని, ఆటోను సీజ్ చేయకూడదని అడిగాడు. అప్పటికే పోలీసులు తమ పనిలో తాము ఉన్నారు. పోలీసులు డ్రైవర్‌ను వాహనం నుండి తన వస్తువులను బయటకు తీయమని చెప్పారు. అయితే వెంటనే ఇర్ఫాన్ ఆటోలో నుంచి ఓ పామును బయటకు తీశాడు. కేసు నమోదు చేయవద్దని, తన ఆటోను విడుదల చేయమని డిమాండ్ చేశాడు.
ట్రాఫిక్ పోలీసు అధికారి వద్దకు వెళ్లి తన మణికట్టుకు చుట్టుకున్న పామును విప్పుతూ ఆ అధికారిని బెదిరించాడు. ఆటో ఇచ్చేస్తారా..మీద పామును వేయమంటారా? అని ట్రాఫిక్ ఎస్సైతో వాగ్వాదానిగి దిగాడు. పామును చేతికి చుట్టుకుంటూ.. విప్పుతూ నానా హంగామా చేశాడు.
ఆశ్చర్యపోయిన అధికారి ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌ను తోసేసాడు, డ్రైవర్ మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి పామును తన మణికట్టుకు చుట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదుతో పోలీసులు ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. మద్య మత్తులో అలా చేశానని, అది చనిపోయిన పాము అని తెలిపాడు. తన అక్కలను ఆటపట్టించడానికి దారిలో చనిపోయిన పాము దొరికితే.. తీసుకొచ్చానని వెల్లడించాడు.
{{/usCountry}}ఆశ్చర్యపోయిన అధికారి ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌ను తోసేసాడు, డ్రైవర్ మళ్ళీ రోడ్డు మీదకు వచ్చి పామును తన మణికట్టుకు చుట్టుకున్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ట్రాఫిక్ ఎస్సై ఫిర్యాదుతో పోలీసులు ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌పై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు. మద్య మత్తులో అలా చేశానని, అది చనిపోయిన పాము అని తెలిపాడు. తన అక్కలను ఆటపట్టించడానికి దారిలో చనిపోయిన పాము దొరికితే.. తీసుకొచ్చానని వెల్లడించాడు.
{{/usCountry}}నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు భద్రతా తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మూడు కమిషనరేట్లలో మద్యం సేవించి వాహనం నడిపినందుకు అధికారులు మొత్తం 2,731 మంది డ్రైవర్లపై అభియోగాలు మోపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 1,198, సైబరాబాద్‌లో 928, రాచకొండ (మల్కాజ్‌గిరి)లో 605 మంది ఉన్నారు.