...
...
Next Story

HMDA Lands Auction : హెచ్‌ఎండీఏ భూముల ఈ-వేలం.. 3000 కోట్లు టార్గెట్!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నగరం పరిధిలోని పలు కీలక ప్రాంతాల్లో భూముల విక్రయానికి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వేలం పాటల ద్వారా రూ. 3,000 కోట్లను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Published on: Aug 12, 2026, 15:31:02 IST
Advertisement

హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పలు కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూభాగాలు, ప్రైమ్ ల్యాండ్ పార్సెళ్లు, లేఅవుట్ ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం ప్రకటనను విడుదల చేసింది. హెచ్‌ఎండీఏ ఈ-వేలం ప్రకటన ద్వారా: కోకాపేట, మోకిల, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల విక్రయం చేయనుంది.

హెచ్ఎండీఏ
హెచ్ఎండీఏ

ప్రధానంగా కొకపేట నియోపొలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని ల్యాండ్ ప్యాకేజీలపై ఈ వేలం ఫోకస్ అయి ఉంటుంది. వీటితో పాటు మోకిలా, ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉన్న భూములను కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ-ల్యాండ్ ఆక్షన్ (ఆన్‌లైన్ బిడ్డింగ్) ద్వారా వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాపర్టీలకు సంబంధించి ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం ఆగస్టు చివరి వారంలో 'ప్రీ-బిడ్ సమావేశాలు' నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్‌లైన్ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నగరం పరిధిలో ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లు, ల్యాండ్ పార్సెల్స్, ప్రాపర్టీలను ఈ నోటిఫికేషన్‌లో చేర్చారు.

కోకాపేట నియోపోలిస్ 4.59 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఎకరాకు ప్రాథమిక కనీస ధర రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. గోల్డెన్ మైల్ లేఅవుట్ 0.70 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఎకరాకు ప్రాథమిక కనీస ధర రూ. 70 కోట్లుగా ఉంటుంది.

ఆగస్టు 19 నుండి ఆగస్టు 25 వరకు సంబంధిత స్థలాలను బట్టి వివిధ తేదీల్లో ప్రీ-బిడ్ సమావేశాలు జరుగుతాయి. గవర్నమెంట్ ల్యాండ్ పార్సెళ్లు: ఆగస్టు 24, 2026, మోకిలా అండ్ బాచుపల్లి లేఅవుట్లు: సెప్టెంబర్ 02, 2026, ఇన్ముల్ నర్వ లేఅవుట్: సెప్టెంబర్ 03, 2026, సరూర్ నగర్ అండ్ హైదర్ నగర్ ల్యాండ్ పార్సెళ్లు: సెప్టెంబర్ 07, 2026, కోకాపేట్ నియోపోలిస్ అండ్ గోల్డెన్ మైల్: సెప్టెంబర్ 09, 2026 తేదీల్లో ఈ వేలం జరగనుంది.

వేలానికి సంబంధించిన బ్రోచర్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్, బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి hmda.gov.in/auctions/ లేదా mstcecommerce.com వెబ్‌సైట్లను సందర్శించవచ్చని హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ లింక్ క్లిక్ చేసి ఈ-వేలం ప్రకటన చూడండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe