హైదరాబాద్‌లో బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా పెట్టిన ఇంటి యజమాని.. వీడియోలు రికార్డ్!
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా పెట్టించాడు ఓ యజమాని. వీడియోలు రికార్డు చేశాడు!
హైదరాబాద్‌లో ఓ ఇంటి ఓనర్ దారుణానికి పాల్పడ్డాడు. నమ్మి అద్దెకు వచ్చిన వారికి దారుణమైన పని చేశాడు. అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టించాడు. వివాహిత వీడియోలను రికార్డు చేశాడు. ఆమె భర్తకు అనుమానం వచ్చి పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ వెంగళరావు నగర్‌లోని ఓ ఇంట్లో భార్యాభర్తలు అద్దెకు ఉంటున్నారు. నమ్మి ఓనర్ మంచివాడు అనుకున్నారు. కానీ అతడి నిజస్వరూపం బయటపడింది. అశోక్ యాదవ్ అనే వ్యక్తి చెందిన ఇంట్లో తన భర్తతో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేసే వివాహిత (23) ఉంటుంది. ఈ నెల 4న, బాత్రూమ్లోని బల్బ్ పనిచేయడం లేదని ఇంటి యజమాని అశోక్ యాదవ్‌కు చెప్పింది.
అశోక్ ఎలక్ట్రిషియన్ పిలిపించి బల్బ్ రిపేర్ చేయించాడు. అయితే ఈ సమయంలో అందులో సీక్రెట్ కెమెరా పెట్టించాడు. ఈ నెల 13న బాత్రూమ్లోని బల్బ్ హోల్డర్ నుండి స్క్రూ పడిపోయింది. దీంతో గమనించిన భర్త.. లైట్ వేసి చూశాడు. హోల్డర్ లోపల కెమెరా ఉందని గుర్తించి షాక్ తిన్నాడు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అడిగాడు.
కానీ ఇంటి యజమాని సరైన సమాధానం ఇవ్వలేదు. ఎలక్ట్రిషియన్ ఈ పని చేసుంటాడని చెప్పాడు. అతన్ని అడగమని యజమానిని కోరారు అద్దెకు ఉండే జంట. కానీ ఎలక్ట్రిషియన్‌ను అడగాల్సిన పని లేదని ఇంటి ఓనర్ చెప్పాడు. అడిగేందుకు నిరాకరించాడు. కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హాని చేస్తాడని బెదిరించాడు. దీంతో ఎలక్ట్రిషియన్, ఇంటి యజమానిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్యాభర్తలు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ఇంటి యజమాని, ఎలక్ట్రిషియన్‌పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాత్‌రూమ్ బల్బ్ హోల్డర్‌లో సీక్రెట్ కెమెరా అమర్చి, వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసినట్టుగా గుర్తించారు. ఇంటి యజమాని అశోక్ యాదవ్‌ను అరెస్టు చేయగా.. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ చింటు కోసం గాలిస్తున్నారు.
మరోవైపు ఇంటి ఓనర్ భార్య.. బాధితురాలికి ఫోన్ చేసిన ఆడియో వైరల్ అవుతుంది. ఈ ఆడియోలో ఇంటి ఓనర్ భార్య.. బాధితురాలిని బెదిరించినట్టుగా ఉంది. కేసుకు సంబంధించిన విషయాలను బాధితురాలు వివరిస్తుండగా.. ఆయనకు ఏమైనా.. అయితే ఊరుకునేది లేదని ఇంటి ఓనర్ భార్య అంటుంది. ఏం చేయాలో అది చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చిన ఆడియో వైరల్ అయింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


