ICMR-NIN Course : హైదరాబాద్‌లో న్యూట్రిషన్ సర్టిఫికేట్ కోర్సు.. ఎలా అప్లై చేయాలి?
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ICMR-NIN) 2027 సంవత్సరానికి గాను సర్టిఫికేట్ కోర్స్ అందించనుంది. ఇందుకోసం దరఖాస్తులను ఆహ్వానించింది. 10 వారాల ఉండే ఈ కోర్సును 2027 జనవరి 6 నుండి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు.
న్యూట్రిషన్ (పోషకాహారం) రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక భారతీయ వైద్య పరిశోధనా మండలి - జాతీయ పోషకాహార సంస్థ (ICMR - National Institute of Nutrition) మంచి అవకాశం కల్పించింది. 2027 విద్యా సంవత్సరానికి గానూ 62వ పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ (PGCCN) ప్రవేశాలకు గానూ ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ కోర్సు ద్వారా అభ్యర్థులకు పోషకాహార విజ్ఞానంలో సమగ్రమైన శిక్షణ, అవగాహన కల్పించనున్నట్లు సంస్థ ప్రకటించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ న్యూట్రిషన్ కోర్సు 10 వారాలు ఉంటుంది. జనవరి 6, 2027 నుండి మార్చి 19, 2027 వరకు తరగతులు జరుగుతాయి. ఫుల్‌టైమ్ ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఇది.
ఈ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు లైఫ్ సైన్సెస్ (బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫుడ్ & న్యూట్రిషన్, డైటెటిక్స్, బయాలజీ, జువాలజీ) లేదా బయోమెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ (M.Sc) పూర్తి చేసి ఉండాలి. MBBS, BDS, BAMS, BHMS, BPT, BUMS, బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి, ఫార్మసీ లేదా అనుబంధ ఆరోగ్య శాస్త్రాలలో ప్రాథమిక డిగ్రీ కలిగి ఉన్నవారు కూడా అర్హులే.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు నమోదు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐసీఎమ్ఆర్-ఎన్ఐఎన్ అధికారిక వెబ్సైట్ www.nin.res.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూరించిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన విద్యార్హత ధృవీకరణ పత్రాల స్కాన్ చేసిన ప్రతులను జత చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన రసీదును దరఖాస్తుకు తప్పనిసరిగా జతచేయాలి. పైన తెలిపిన అన్ని పత్రాలను ninpgccn@gmail.com ఈమెయిల్ ఐడీకి పంపించాలి. దరఖాస్తులను నవంబర్ 6 సాయంత్రంలోగా సమర్పించాల్సి ఉంటుంది. భారతీయ అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు సుమారు రూ.50,000గా నిర్ణయించారు.
నవంబర్ 6వ తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులను, ఫీజు చెల్లింపు ఆధారాలు లేని అప్లికేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని NIN స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లోని ICMR-NIN ఆసియా ఖండంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పోషకాహార పరిశోధనా సంస్థలలో ఒకటి. ఈ 10 వారాల సర్టిఫికేషన్ కోర్సును పూర్తి చేయడం ద్వారా మెడికల్ ఆఫీసర్లు, న్యూట్రిషనిస్టులు, రీసెర్చర్లు, హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ క్లినికల్ న్యూట్రిషన్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్, కమ్యూనిటీ న్యూట్రిషన్ విభాగాలలో నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చు. ఏవైనా అనుమానాలు ఉంటే 040-27197247ను సంప్రదించండి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


