హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో జరుగుతున్న ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల కారణంగా ట్రాఫిక్ మళ్లింపులను అమలు చేశారు. సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశం రద్దీని నియంత్రించడం. రద్దీ సమయాల్లో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచించారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని IIIT జంక్షన్ లోపల, చుట్టుపక్కల సురక్షితమైన, సమర్థవంతమైన రాకపోకలను నిర్ధారించడానికి, వివిధ ప్రదేశాలు, కూడళ్లు, రహదారుల వద్ద సుమారు ఒక సంవత్సరం పాటు కొనసాగే ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలు అవుతాయని ప్రకటనలో అధికారులు తెలిపారు.
ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, ప్రత్యామ్నాయ మార్గాలపై ట్రాఫిక్ సలహా జారీ అయింది.
గచ్చిబౌలి జంక్షన్ నుండి ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, హెచ్‌సీయూ గేట్ నెం 2 మీదుగా లింగంపల్లి వైపు ప్రయాణించే ట్రాఫిక్‌ను ఐఐఐటీ జంక్షన్ వద్ద విప్రో జంక్షన్ వైపు మళ్లించి, గౌలిదొడ్డి వైపు కుడి మలుపు తీసుకుని, ఆ తర్వాత గోపన్‌పల్లి జంక్షన్, నల్లగండ్ల మీదుగా లింగంపల్లి వైపు వెళ్లేలా ఏర్పాటు చేశారు.
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గోపన్‌పల్లి తండా, గౌలిదొడ్డి, క్యూ సిటీ, విప్రో జంక్షన్ నుండి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను, విప్రో జంక్షన్ వద్ద నానక్‌రామ్‌గూడ రోటరీ 2 వైపు మళ్లించి, అక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుని, ఓఆర్‌ఆర్ వైపుగా- గచ్చిబౌలి జంక్షన్‌కు మళ్లిస్తారు.
లింగంపల్లి నుంచి హెచ్‌సీయూ, మసీదుబండ టీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, డీఎల్ఎఫ్ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి, కొత్తగూడ, మెహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్ఎంఆర్/హెచ్‌సీయూ బస్ డిపో జంక్షన్ నుంచి మసీద్‌బండ వైపు మళ్లించి, శ్రీరాంనగర్, బొటానికల్ జంక్షన్, రైట్-టర్న్ తీసుకుని ఉడిపి హోటల్ వైపు వస్తారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని జెడ్పీహెచ్ఎస్ గచ్చిబౌలి మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వైపు వస్తారు.
{{/usCountry}}లింగంపల్లి నుంచి హెచ్‌సీయూ, మసీదుబండ టీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం, డీఎల్ఎఫ్ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి, కొత్తగూడ, మెహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్ఎంఆర్/హెచ్‌సీయూ బస్ డిపో జంక్షన్ నుంచి మసీద్‌బండ వైపు మళ్లించి, శ్రీరాంనగర్, బొటానికల్ జంక్షన్, రైట్-టర్న్ తీసుకుని ఉడిపి హోటల్ వైపు వస్తారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకుని జెడ్పీహెచ్ఎస్ గచ్చిబౌలి మీదుగా గచ్చిబౌలి జంక్షన్ వైపు వస్తారు.
{{/usCountry}}ఫ్లైఓవర్ అభివృద్ధి పనులు కనీసం ఒక సంవత్సరం పాటు కొనసాగే అవకాశం ఉన్నందున, ట్రిపుల్ ఐటీ జంక్షన్, దాని పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఐటీ ఉద్యోగులతో సహా నిత్యం ప్రయాణించే వారిని, సురక్షితమైన ప్రయాణం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు కోరారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచించారు.
ఈ ట్రాఫిక్ మళ్లింపులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి. సుమారు ఏడాదిపాటు ఇలాగే ఉండనుంది.