శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీతో పాటు రానున్న సంక్రాంతి, ఇతర పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించడంతో పాటు, దర్భంగా – యశ్వంత్‌పూర్, దానాపూర్ – బెంగళూరు కంటోన్మెంట్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
హైదరాబాద్ – మంగళూరు ప్రత్యేక రైళ్లు

శబరిమల యాత్ర, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించారు. మొత్తం 18 సర్వీసులు నడుస్తాయి. 07097 హైదరాబాద్ – మంగళూరు సెంట్రల్ 02.12.2026 నుండి 27.01.2027 వరకు, 07098 మంగళూరు సెంట్రల్ – హైదరాబాద్ 03.12.2026 నుండి 28.01.2027 వరకు నడుస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, సేడం, యాద్గిర్, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, కృష్ణరాజపురం, బంగారుపేట, కుప్పం, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, షోరనూర్, తిరూర్, కోజికోడ్, వడకర, తలస్సేరి, కన్నూర్, పయ్యనూర్, కన్హంగాడ్, కాసరగోడ్ స్టేషన్లలో ఆగుతాయి.
దర్భంగా – యశ్వంత్‌పూర్
పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దర్భంగా – యశ్వంత్‌పూర్ మధ్య 10 సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 05541 దర్భంగా – యశ్వంత్‌పూర్ మధ్య 16.11.2026 నుండి 14.12.2026 వరకు, 05542 యశ్వంత్‌పూర్ – దర్భంగా 19.11.2026 నుండి 17.12.2026 వరకు నడుస్తాయి.
సమస్తిపూర్, ముజఫర్‌పూర్, హాజీపూర్, సోన్పూర్, ఛాప్రా గ్రామీణ్, ఛాప్రా, సివాన్, డియోరియా సదర్, గోరఖ్‌పూర్, గోండా, బారాబంకి, ఐష్బాగ్, కాన్పూర్ సెంట్రల్, ఒరై, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సీ, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్, డోన్, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
దానాపూర్ – బెంగళూరు కంటోన్మెంట్ వన్-వే ప్రత్యేక రైళ్లు
{{/usCountry}}సమస్తిపూర్, ముజఫర్‌పూర్, హాజీపూర్, సోన్పూర్, ఛాప్రా గ్రామీణ్, ఛాప్రా, సివాన్, డియోరియా సదర్, గోరఖ్‌పూర్, గోండా, బారాబంకి, ఐష్బాగ్, కాన్పూర్ సెంట్రల్, ఒరై, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, బినా, భోపాల్, ఇటార్సీ, ఆమ్లా, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్లార్షా, రామగుండం, కాజీపేట, కాచిగూడ, మహబూబ్‌నగర్, డోన్, ధర్మవరం, హిందూపురం, యలహంక స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి. ఈ రైళ్లలో 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
దానాపూర్ – బెంగళూరు కంటోన్మెంట్ వన్-వే ప్రత్యేక రైళ్లు
{{/usCountry}}ఛత్ పండుగ అనంతరం తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దానాపూర్ నుండి బెంగళూరు కంటోన్మెంట్‌కు రెండు వన్ వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 03241 దానాపూర్ – బెంగళూరు కంటోన్మెంట్ నవంబర్ 19 గురువారం సాయంత్రం 6 గంటలకు బయల్దేరి శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 03245 దానాపూర్ – బెంగళూరు కంటోన్మెంట్ ట్రైన్ నవంబర్ 20 శుక్రవారం సాయంత్రం 6 బయల్దేరి ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఆరా, బక్సర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, మీర్జాపూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకి, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, బల్లార్షా, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, పెరంబూర్, కాట్పాడి, జోలార్‌పేట, బంగారుపేట స్టేషన్లలో ఆగుతాయి. ఈ వన్-వే ప్రత్యేక రైళ్లలో స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.