Sankranti Trains : సంక్రాంతి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం - పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు, లిస్ట్ ఇదే

SCR Sankranti Special Trains 2027 : రాబోయే క్రిస్మస్, సంక్రాంతి  దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.  సికింద్రాబాద్-శ్రీకాకుళం, చర్లపల్లి-శ్రీకాకుళం, చర్లపల్లి-కాకినాడ మధ్య నడిచే వారపు ప్రత్యేక పొడిగించింది. 

Published on: Nov 15, 2026, 06:02:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

SCR Sankranti Special Trains 2027 : రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. పండుగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ఆరు వారపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి - కాకినాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మొదటి వారం వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పండుగ వేళ టికెట్లు దొరక్క ఇబ్బంది పడే ప్రయాణికులు ఈ పొడిగించిన తేదీలను గమనించి ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ ప్రత్యేక రైళ్లు (9 సర్వీసులు) :

  • రైలు నెం. 07425 (సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్) : ప్రతి ఆదివారం నడిచే ఈ రైలును డిసెంబర్ 6, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు పొడిగించారు.
  • రైలు నెం. 07426 (శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్) : ప్రతి సోమవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 7, 2026 నుంచి ఫిబ్రవరి 1, 2027 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో ఒక్కొక్కటి 9 ట్రిప్పుల చొప్పున నడుస్తాయి.

చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (9 సర్వీసులు) :

  • రైలు నెం. 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్) : ప్రతి మంగళవారం నడిచే ఈ రైలు సర్వీసులను డిసెంబర్ 1, 2026 నుంచి జనవరి 26, 2027 వరకు పొడిగించారు.
  • రైలు నెం. 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి) : ప్రతి బుధవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 2, 2026 నుంచి జనవరి 27, 2027 వరకు రాకపోకలు సాగిస్తుంది. ఇవి కూడా 9 సర్వీసుల చొప్పున నడుస్తాయి.

చర్లపల్లి – కాకినాడ – చర్లపల్లి ప్రత్యేక రైళ్లు (9 సర్వీసులు) :

  • రైలు నెం. 07039 (చర్లపల్లి - కాకినాడ) : ప్రతి గురువారం నడిచే ఈ ప్రత్యేక రైలును డిసెంబర్ 3, 2026 నుంచి జనవరి 28, 2027 వరకు పొడిగించారు.
  • రైలు నెం. 07040 (కాకినాడ - చర్లపల్లి) : ప్రతి శుక్రవారం నడిచే ఈ రైలు డిసెంబర్ 4, 2026 నుంచి జనవరి 29, 2027 వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఈ మార్గంలోనూ 9 సర్వీసుల చొప్పున నడపనున్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More