హైదరాబాద్ మెట్రో రైలు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం 20 మంది ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సేవల్లో చేర్చుకున్నట్లు ప్రకటించింది. ఇండక్షన్ సెక్యూరిటీ శిక్షణ పూర్తయిన తరువాత 20 మందిని ఎంపిక చేసింది. ఆయా సిబ్బందిని ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లతో పాటు మెట్రో రైళ్లలో విధులు నిర్వర్తించడం ప్రారంభించారని హైదరాబాద్ మెట్రో రైల్ ఒక ప్రకటనలో తెలిపింది.
"ట్రాన్స్ జెండర్ సిబ్బందిని భద్రతా సిబ్బందిలోకి చేర్చడం సామాజిక సాధికారత మరియు సమ్మిళితత్వానికి బలమైన చిహ్నంగా నిలుస్తుంది. మెట్రో రైలు వ్యవస్థపై మహిళల భద్రత మరియు ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగు" అని హైదరాబాద్ మెట్రో పేర్కొంది.
కొత్తగా నియమితులైన ట్రాన్స్‌జెండర్ సిబ్బంది… మహిళలకు ప్రత్యేకంగా కేటాయించిన కోచ్‌లతో పాటు ఇతర సాధారణ కోచ్‌లలోనూ భద్రతా చర్యలను పర్యవేక్షిస్తారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడం, మార్గనిర్దేశం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించడం వంటి బాధ్యతలను వారు నిర్వహిస్తారు.
హైదరాబాద్ మెట్రో రైలు మూడు కారిడార్లలో 57 స్టేషన్లతో నడుస్తుందని… రోజుకు దాదాపు ఐదు లక్షల మంది ప్రయాణికుల ప్రయాణిస్తారని హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఇందులో 30 శాతం మంది మహిళలు ఉన్నారని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 39 మంది ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించిన సంగతి తెలిసిందే.
మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లు:
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో సరికొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగరంలోని 7 మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సౌకర్యం ప్రారంభమైంది. ఈ నిర్ణయం నవంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. వీటిలో మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హై-టెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి.
{{/usCountry}}నగరంలోని 7 మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్ల సౌకర్యం ప్రారంభమైంది. ఈ నిర్ణయం నవంబర్ 29 నుంచి అమల్లోకి వచ్చింది. వీటిలో మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హై-టెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి.
{{/usCountry}}ప్రయాణికుల హెల్మెట్లు, సామాన్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు ఇతర వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా భద్రపరిచేందుకు ఈ స్మార్ట్ లాకర్లు ఉపయోగపడతాయి.లాకర్ పై క్యూఆర్ కోడ్ లను ఏర్పాటు చేశారు. వాటిని స్కాన్ చేసి సైజ్ వివరాలను తెలుసుకోవచ్చు. పేమెంట్ చేసి మీకు తగిన లాకర్ ను ఏంచుకోవచ్చు. ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ లిమిటెడ్, టక్కీట్ భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేశారు. http://www.tuckit.in/ వెబ్ సైట్ ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చు.