హైదరాబాద్ మెట్రో రైల్ టేకోవర్ ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఆదేశించారు. ఎల్ అండ్ టీ అధికారులతో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.టేకోవర్ తాజా స్థితిని సమీక్షించిన ఆయన…ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా బదిలీ సజావుగా మరియు వేగంగా జరగాలని ఉద్ఘాటించారు.
100 రోజుల ప్లాన్….
ఇప్పటికే ఉన్న ఒప్పందాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. రాబోయే 100 రోజుల్లో ప్రణాళికాబద్ధమైన విధానాలను క్రమపద్ధతిలో తీసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎల్ అండ్ టి పూర్తి సహకారం అందించాలని కోరారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ ఎంఆర్ ఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టీతో పాటు ప్రభుత్వ తరుపు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలిదశను ఎల్ అండ్ టీ గ్రూప్ నుంచి స్వాధీనం చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ లోనే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ మేరకు ఇరు పక్షాల మధ్య అంగీకారం కూడా కుదిరింది. ఇందులో భాగంగా కంపెనీ రూ.13,000 కోట్ల రుణాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టులో ఎల్ అండ్ టీకి 90 శాతం ఈక్విటీ ఉంది.
రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు పొందడం కోసం మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ ప్రాజెక్టు అప్పు 13 వేల కోట్లు తన మీద వేసుకొని…. ఎల్ అండ్ టీ ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తంలో 2,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే టేక్ ఓవర్ ప్రాసెస్ కొనసాగుతోంది.
{{/usCountry}}రెండో దశ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు పొందడం కోసం మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ ప్రాజెక్టు అప్పు 13 వేల కోట్లు తన మీద వేసుకొని…. ఎల్ అండ్ టీ ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తంలో 2,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగానే టేక్ ఓవర్ ప్రాసెస్ కొనసాగుతోంది.
{{/usCountry}}