న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్ నగరం రెడీ అయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో కూడా అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 31వ తేదీన మెట్రో రైలు సర్వీసుల సమయం పొడిగిస్తున్నట్టుగా ఎల్అండ్‌టీ హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడుస్తుంది. కానీ డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైలు సర్వీసులు నడుస్తాయి. ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరుతుంది. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మెట్రో తెలిపింది. పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడించింది.
అయితే హైదరాబాద్ మెట్రోలో మద్యం తీసుకెళ్లవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంది. దీనిపై ఆరా తీస్తున్నారు. నిజానికి హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల భద్రతాకు చాలా ప్రాధాన్యం ఇస్తుంది. భద్రతా పరంగా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. బస్సు, రైల్వేతో పోల్చితే మెట్రో నిబంధనలు కఠినంగా ఉంటాయి. ఈ విషయంలో హైదరాబాద్ మెట్రో చాలా స్పష్టంగా ఉంటుంది.
ఇక మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చా అనే విషయంపై చాలా మందికి ప్రశ్నలు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ మెట్రో జారీ చేసిన నిబంధనల ప్రకారం రెండు సీల్ చేసిన మద్యం బాటిళ్లు తీసుకెళ్లవచ్చు. కాస్త ఓపెన్ చేసి ఉన్నా.. వాటిని అనుమతించరు అని మెట్రో నిషేధిత జాబితాలో ఉంది. కానీ తర్వాత వచ్చిన వార్తల ప్రకారం మద్యం బాటిళ్లకు అనుమతి లేదు. ఈ విషయంపై గందరగోళం నెలకొంది. దీనిపై HT Telugu హైదరాబాద్ మెట్రో కస్టమర్ కేర్ సర్వీస్‌కి కాల్ చేసింది. సీల్ చేసి ఉన్న రెండు బాటిళ్లకు మాత్రమే అనుమతి ఉందని కస్టమర్ సర్వీస్ వెల్లడించింది.
అయితే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు మద్యం బాటిళ్లను మెట్రోలో తీసుకెళ్లకపోవడమే మంచిది. మెట్రో రైలు ప్రాంగణంలో ప్రవేశించే ప్రతీ ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఎలాంటి నిషేధిత వస్తువు ఉన్నా.. అనుమతి ఉండదు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా తాగి మెట్రోలో వెళ్లడం కూడా మంచిది కాదు. తాగి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తే.. మెట్రో కఠినమైన చర్యలు తీసుకుంటుంది.
మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించడం నేరంగా చూస్తారు. స్టేషన్ ప్రాంగణంలో, రైలు లోపల మద్యం సేవించడంనేరం. మెట్రో చట్టం ప్రకారం.. ఇలాంటి పనులు చేసినవారికి భారీగా జరిమానాలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండవచ్చు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ విషయంలో సీరియస్‌గా ఉంటారు.
{{/usCountry}}మద్యం సేవించి మెట్రోలో ప్రయాణించడం నేరంగా చూస్తారు. స్టేషన్ ప్రాంగణంలో, రైలు లోపల మద్యం సేవించడంనేరం. మెట్రో చట్టం ప్రకారం.. ఇలాంటి పనులు చేసినవారికి భారీగా జరిమానాలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా ఉండవచ్చు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ విషయంలో సీరియస్‌గా ఉంటారు.
{{/usCountry}}మెట్రోలో ఇతరులతో గొడవలు పడటం, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం కూడా చేస్తే మీకు ఇబ్బందులు తప్పవు. సీసీ కెమెరా ద్వారా వెంటనే గుర్తిస్తారు. చర్యలు తీసుకుంటారు. మద్యం మత్తులో ఊగుతూ వెళ్తే.. రైలు ఎక్కనివ్వరు. ప్రతీ స్టేషన్లో భారీగా సిబ్బంది ఉంటారు. ప్రయాణికుల భద్రతకు హైదరాబాద్ మెట్రో అధిక ప్రాధాన్యత ఇస్తుంది.
తుపాకులు, కత్తులు, పెంపుడు జంతువులు, మండే వస్తువులు, ప్రమాదకర వస్తువులు, పేలుడు పదార్థాలను మెట్రోలో అనుమతి ఇవ్వరు. మెట్రోలో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి.
ఈ లింక్ క్లిక్ చేసి హైదరాబాద్ మెట్రో నిషేధిత వస్తువుల జాబితా చదవండి.