...
...
Next Story

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 552 మందిపై కేసు నమోదు.. సజ్జనార్ హెచ్చరిక

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతపు డ్రంక్-డ్రైవింగ్ తనిఖీలలో 552 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు తెలిపారు.

Published on: Nov 30, 2025, 15:03:43 IST
Advertisement

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వారాంతపు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవింగ్ తనిఖీలలో 552 మందిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో 438 మంది ద్విచక్ర వాహనదారులు, 45 మంది త్రిచక్ర వాహనదారులు, 69 మంది నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రత్యేక డ్రంక్ డ్రైవింగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ సందర్భంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనం నడిపినందుకు 552 మంది వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడారు. 'డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలపై జీరో టాలరెన్స్.' ఉంటుందని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేవారి కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని చెప్పారు.

ట్రాఫిక్ పోలీసులతో సహకరించాలని లేదా కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ ప్రయాణికులకు తెలిపారు. డ్రంక్ డ్రైవ్ చేస్తూ.. మీ ప్రాణాల మీదకు, ఇతరుల ప్రాణాల మీదకు తెవద్దని వెల్లడించారు.

ఈ డ్రైవ్‌లో భాగంగా రక్తంలో ఆల్కహాల్ కంటెంట్ (BAC) స్థాయిల విభజన నమోదు అయ్యాయి: 30–50 mg మధ్య 127 కేసులు, 51–100 mg మధ్య 212 కేసులు, 101–150 mg మధ్య 112 కేసులు, 151–200 mg మధ్య 64 కేసులు, 201–250 mg మధ్య 27 కేసులు, 300 mg కంటే ఎక్కువ 8 కేసులు ఉన్నాయి.

నగరం అంతటా రోడ్డు భద్రతను నిర్ధారించడానికి ఈ చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని, ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలను నడపవద్దని హెచ్చరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe