Hyderabad : కేబీఆర్ పార్క్ సైడ్ వెళ్తున్నారా? ఈ ట్రాఫిక్ మళ్లింపులు తెలుసుకునే బయల్దేరండి
Hyderabad Traffic : బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు సైడ్ వెళ్లేవారు నేటి(శుక్రవారం) నుంచి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు ఫాలో కావాలి. ట్రాఫిక్ మళ్లింపు తెలుసుకుని వెళ్లాలి.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్ట్ కింద జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ఈరోజు(శుక్రవారం)నుంచి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీసు కమిషనర్ తెలిపారు. ఈ దారుల్లో వెళ్లేవారు ఆంక్షలు, మళ్లింపులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 2లో స్తంభాల నిర్మాణ పనులు శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) నుండి ప్రారంభమయ్యాయి. ముగ్ధ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-I), జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మధ్య ట్రాఫిక్ రద్దీ ఉంటుందని భావిస్తున్నారు.
మళ్లింపు ఇలా..
NFCL నుండి శ్రీనగర్ కాలనీ టీజంక్షన్, సాగర్ సొసైటీ, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నంబర్ 36, 45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు ప్రయాణించే వాహనదారులను శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్, సాగర్ సొసైటీ వద్ద మళ్లిస్తారు. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, ఇందిరానగర్ లేబర్ అడ్డా, రోడ్ నంబర్ 5 జూబ్లీహిల్స్, వెంకటగిరి ఎక్స్ రోడ్ల ద్వారా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చేరుకునే ముందు దారి మళ్లిస్తారు.
జూబ్లీహిల్స్‌లోని 36, 45 రోడ్ నంబర్ల నుండి NFCL వైపు వెళ్లే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద వెంకటగిరి రోడ్ నంబర్ 2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్, మైత్రివనం, అమీర్‌పేట, ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ మీదుగా పంజాగుట్ట ప్రధాన రహదారి వైపు మళ్లిస్తారు.
కేసీపీ గెస్ట్ హౌస్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు ప్రయాణించే ప్రయాణికులు క్యాన్సర్ హాస్పిటల్ వైపు రోడ్డు నంబర్ 10 తీసుకొని, అగ్రసేన్ ఐలాండ్ వద్ద ఎడమవైపుకు తిరిగి భారతీయ విద్యా భవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45వైపు వెళ్లవచ్చు.
అదేవిధంగా మాసాబ్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వచ్చే వారు విరించి హాస్పిటల్ సమీపంలోని 1/12 వద్ద ఎడమవైపుకు వెళ్లి అగ్రసేన్ ఐలాండ్ మీదుగా రోడ్డు నంబర్ 45 వైపు కొనసాగాలి.
అవసరమైతే మాత్రమే ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని పోలీసులు తెలిపారు. ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల మధ్య రద్దీ సమయాల్లో ఈ రూట్లలో ప్రయాణం చేయకుండా చూడాలని అధికారుు తెలిపారు. రియల్-టైమ్ అప్డేట్స్ కోసం నావిగేషన్ అప్లికేషన్‌లను ఉపయోగించండి. రద్దీ సమయాల్లో భారీ వాహనాలు ఈ రూట్లలోకి తీసుకురావొద్దు.
పోలీసులు పౌరులకు సహకరించాలని, అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్డేట్స్ ఫాలో కావాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో, ప్రయాణికులు సహాయం కోసం 9010203626లో ట్రాఫిక్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


