విజయ్-రష్మిక పెళ్లి: జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి ప్రైవేట్ జెట్ వరకు.. వీరి ఆస్తుల చిట్టా ఇదే!
పెళ్లికి ముందే 'విరోష్' (VIROSH) ఆస్తుల వేట మొదలైంది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి పీటలెక్కబోతున్న విజయ్ దేవరకొండ - రష్మికల ఉమ్మడి నెట్ వర్త్ అక్షరాలా రూ. 136 కోట్లు. వీరి వద్ద ఉన్న ప్రైవేట్ జెట్, లగ్జరీ కార్లు, బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సినిమా అభిమానులు ఈ జంట గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఈ టాలీవుడ్ క్యూట్ కపుల్.. తమ వేడుకకు 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' (The Wedding of VIROSH) అని పేరు పెట్టారు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు ముందే ఈ పవర్ కపుల్ ఉమ్మడి ఆస్తుల విలువ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

విజయ్, రష్మిక పెళ్లి సందడి..
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరగనుంది. పెళ్ళికి ముందు జరిగే హల్దీ, సంగీత్ వంటి వేడుకలు అక్కడే జరగనున్నాయి. దీనికోసం ఈ జంట ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకుంది.
ఆ తర్వాత మార్చి 4న మన హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకల సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు అందరి దృష్టీ వీళ్లిద్దరి ఆస్తులపైనే పడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
రష్మిక మందన్న ఆస్తుల వివరాలు
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో రష్మిక ఒకరు. 2026 ఫోర్బ్స్ (Forbes) నివేదిక ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ. 66 కోట్లు.
రష్మిక మందన్న ఒక్కో సినిమాకు రూ. 4 నుండి 8 కోట్లు తీసుకుంటుంది. 'పుష్ప' లాంటి భారీ హిట్స్ కోసం రూ. 10 కోట్లు ఛార్జ్ చేసిందని సమాచారం. ఇక కల్యాణ్ జ్యువెలర్స్, మీషో, బోట్, 7UP, స్వరోవ్‌స్కీ వంటి పలు బ్రాండ్స్‌కు ఆమె అంబాసిడర్‌గా ఉంది. అలాగే 'ప్లమ్' అనే వీగన్ బ్యూటీ బ్రాండ్‌లో భాగస్వామిగా పెట్టుబడులు కూడా పెట్టింది.
రష్మికకు ముంబై, హైదరాబాద్, గోవా, కూర్గ్, బెంగళూరులలో (రూ. 8 కోట్ల ఇల్లు) ప్రాపర్టీలు ఉన్నాయి. ఆమె గ్యారేజీలో ఆడి క్యూ3, రేంజ్ రోవర్ స్పోర్ట్, మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి.
విజయ్ దేవరకొండ ఆస్తుల వివరాలు
అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ కూడా సంపాదనలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. లైఫ్‌స్టైల్ ఆసియా 2026 నివేదిక ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 66 నుండి 70 కోట్లు.
విజయ్ ఒక్కో సినిమాకు రూ. 12 - 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు రూ. 1 - 2 కోట్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్ పోస్ట్‌కు సుమారు రూ. 40 లక్షలు వసూలు చేస్తాడు.
ఇక అతడు తన సొంత అపరెల్ బ్రాండ్ 'రౌడీ' (Rowdy) ద్వారా ఏటా రూ. 5 - 8 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. అలాగే వాలీబాల్ టీమ్ ‘హైదరాబాద్ బ్లాక్‌హాక్స్’లో భారీ పెట్టుబడి పెట్టి కో-ఓనర్‌గా ఉన్నాడు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో రూ. 15 కోట్ల విలువైన లగ్జరీ ఇల్లు ఉంది. దీనితో పాటు రూ. 30 కోట్ల విలువైన సొంత ప్రైవేట్ జెట్ కూడా అతని సొంతం. బీఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్, ఫోర్డ్ మస్టాంగ్, వోల్వో ఎక్స్‌సీ90, బెంజ్ జీఎల్‌ఎస్, రేంజ్ రోవర్ వంటి కార్లు అతని వద్ద ఉన్నాయి.
ఉమ్మడి ఆస్తుల విలువ
రష్మిక, విజయ్ ఇటు సినిమాలు, అటు బ్రాండ్లు, వ్యాపారాలలో పోటీ పడి మరీ సంపాదిస్తున్నారు. దీంతో ఇద్దరి సంపద రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఈ ఇద్దరూ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో పెళ్లి తర్వాత వీళ్ల సంపద మరింత పెరగనుంది. ప్రస్తుతానికైతే రష్మిక - విజయ్ దంపతుల మొత్తం ఉమ్మడి నెట్ వర్త్ రూ. 132 నుండి 136 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


