హైదరాబాద్ నగరంలో రోడ్లపైకి మురుగునీరు లేదా శుద్ధి చేసిన వ్యర్థ జలాలను వదిలిపెట్టే వారిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్(HMWSSB) కఠిన చర్యలు ప్రారంభించింది. నిబంధనలను ఉల్లంఘించి, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా నీటిని రోడ్లపైకి వదిలిన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 82 లోని ఒక ప్రైవేట్ వాణిజ్య సంస్థకు జలమండలి అధికారులు ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధించారు.

జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో జూన్ 26న జలమండలి అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సదరు కమర్షియల్ కాంప్లెక్స్ తమ సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుండి వస్తున్న శుద్ధి చేసిన తర్వాత నీటిని నేరుగా బహిరంగ రహదారిపైకి వదులుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల రోడ్డుపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, స్థానికంగా అపరిశుభ్ర వాతావరణం ఏర్పడి వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ ఉల్లంఘనపై తీవ్రంగా స్పందించిన హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ(HMWSSB) సదరు యాజమాన్యానికి చట్టబద్ధమైన నోటీసులు జారీ చేసింది. తక్షణమే రోడ్డుపైకి నీటిని వదలడం ఆపాలని, నిబంధనల ప్రకారం ఆ శుద్ధి చేసిన నీటిని మొక్కలకు లేదా ఇతర అవసరాలకు పునర్వినియోగం చేయాలని ఆదేశించింది. ఈ నోటీసు అందిన 48 గంటల్లోగా వివరణతో కూడిన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా విధించిన రూ.1 లక్ష జరిమానాను మూడు రోజుల్లోగా చెల్లించకపోతే అదనపు పెనాల్టీలతో పాటు, ఆ సంస్థకు ఉన్న తాగునీటి సరఫరా, డ్రైనేజీ కనెక్షన్లను నిలిపివేస్తామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బోర్డు తీవ్రంగా హెచ్చరించింది.
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందించడంతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థను పర్యవేక్షించే ప్రధాన బాధ్యత HMWSSBదే. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా జలమండలి వందల మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసేందుకు అత్యాధునిక ఎస్టీపీలను నిర్మిస్తోంది. నగరంలోని నాలాలు, మూసి నది కలుషితం కాకుండా చూడటమే దీని ముఖ్య ఉద్దేశం.
పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు శుద్ధి చేసిన నీటిని రోడ్లపైకి వదలకుండా, ఫ్లషింగ్, గార్డెనింగ్ కోసం వాడుకోవాలి. నగరంలో ఎక్కడైనా డ్రైనేజీ లీకేజీలు ఉన్నా లేదా ఎవరైనా రోడ్లపైకి నీటిని వదులుతున్నా ప్రజలు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
{{/usCountry}}పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, గేటెడ్ కమ్యూనిటీలు శుద్ధి చేసిన నీటిని రోడ్లపైకి వదలకుండా, ఫ్లషింగ్, గార్డెనింగ్ కోసం వాడుకోవాలి. నగరంలో ఎక్కడైనా డ్రైనేజీ లీకేజీలు ఉన్నా లేదా ఎవరైనా రోడ్లపైకి నీటిని వదులుతున్నా ప్రజలు జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
{{/usCountry}}నగర పరిశుభ్రత, పౌరుల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారికైనా భారీ జరిమానాలు తప్పవని జలమండలి అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కొందరు నల్లాలకు మోటర్లు బిగిస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. వారికి కూడా భారీగా జరిమానాలు విధిస్తోంది జలమండలి.