...
...
Next Story

Telangana Tourism : టూరిస్ట్ ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులు.. మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో ప్యాకేజీలకు ప్లానింగ్!

డబుల్ డెక్కర్ బస్సులను పర్యాటక ప్రాంతాల్లో సరిగా ఉపయోగించుకోవాలని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ భావిస్తోంది. ఇందుకోసం ఆ బస్సులను తీసుకోవాలని ప్రణాళికలు వేస్తోంది.

Published on: Feb 27, 2026, 11:34:40 IST
Advertisement

హైదరాబాద్‌లో పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. సిటీ ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సు అనుభవాన్ని గొప్పగా పునరుద్ధరించాలని హెచ్ఎండీఏ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA)కి డబుల్ డెక్కర్ బస్సుల ఆర్థిక, కార్యాచరణ భారంగా మారింది. ఫిబ్రవరి 2023లో ప్రవేశపెట్టిన ఆరు ఎలక్ట్రిక్ ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు త్వరలో నగర రోడ్లలో పెద్దగా కనిపించకపోవచ్చు.

డబుల్ డెక్కర్ బస్సులు
డబుల్ డెక్కర్ బస్సులు

కారణం.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ(TGTDC), రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను మోహరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏను సంప్రదించింది. అధికారుల ప్రకారం.. TGTDC ఇటీవల పర్యాటక ప్రాంతాల కోసం బస్సులను అప్పగించాలని కోరుతూ హెచ్ఎండీఏకు లేఖ రాసింది. దీనికి అథారిటీ సూత్రప్రాయంగా అంగీకరించిందని సమాచారం. చర్చలు జరుగుతున్నాయని త్వరలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

సరైన మార్కెటింగ్‌తో బస్సులను బడ్జెట్ ధరలో ప్రయాణ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక అధికారులు భావిస్తున్నారు. ప్రజల స్పందన బాగుంటుందని భావిస్తున్నారు. దీనిద్వారా ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడుతుందని పర్యాటక అధికారులు విశ్వసిస్తున్నారు.

ఉదాహరణకు వరంగల్‌లోని రామప్ప ఆలయం, వికారాబాద్‌లోని అనంతగిరి కొండలు, ఇతర ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు ప్యాకేజీ టూర్‌లను నిర్వహించడం ప్రతిపాదనలలో ఉన్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులను అక్కడకు ప్లాన్ చేస్తే.. పర్యాటకులకు కూడా కొత్త అనుభూతి కలుగుగుతుందని భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించడం, సిటీలోని ముఖ్యమైన ప్రాంతాలకు ప్రయాణాలను అందించడం లక్ష్యంగా డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చారు. తక్కువ ఆక్యుపెన్సీ, పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా ఇబ్బందికరంగా మారింది. ఆరు బస్సులకు నెలవారీ కార్యకలాపాల ఖర్చులు ఎక్కువే అవుతున్నట్టుగా సమాచారం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe