హైదరాబాద్‌లోని చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడే ప్రక్రియలో తాము పూర్తి రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తున్నామని హైడ్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A కల్పిస్తున్న హక్కులు, బాధ్యతల ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు.

గడిచిన రెండేళ్ల కాలంలో ల్యాండ్ మాఫియా, భూకబ్జాదారుల బారి నుంచి సుమారు రూ. 1.50 లక్షల కోట్ల (17 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. ఆక్రమణల చెరలో ఉన్న వందలాది చెరువులు, పార్కులకు విముక్తి కల్పించడమే కాకుండా, ఆరు చెరువులను ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని ఆయన తెలిపారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.
కబ్జాదారులు వేసిన కేసులే!
తమపై వస్తున్న కోర్టు ధిక్కార కేసుల వార్తలపై రంగనాథ్ తీవ్రంగా స్పందించారు. "నాపై ప్రస్తుతం 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. అయితే ఈ కేసులు వేసింది ఎవరో ప్రజలు గ్రహించాలి. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, సామాన్యుల ప్లాట్లను మింగేయాలని చూసిన బడా భూకబ్జాదారులు, ల్యాండ్ మాఫియా మాత్రమే ఈ కేసులు వేశాయి," అని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు.
భూమాఫియా తప్పుడు సమాచారంతో న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టిస్తోందని రంగనాథ్ చెప్పారు. చట్టాలు, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని…. ఈ కేసులన్నింటినీ చట్టపరంగానే ఎదుర్కొంటానని ధీమా వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట ప్రాంతంలో దాదాపు రూ. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కుట్ర చేసిందని రంగనాథ్ వెల్లడించారు. ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని చూపిస్తూ, అసలు ఉనికిలోనే లేని ఆధారాలతో 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొన్నారు.
{{/usCountry}}సికింద్రాబాద్ సమీపంలోని లోతుకుంట ప్రాంతంలో దాదాపు రూ. 10,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కుట్ర చేసిందని రంగనాథ్ వెల్లడించారు. ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమిని చూపిస్తూ, అసలు ఉనికిలోనే లేని ఆధారాలతో 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని పేర్కొన్నారు.
{{/usCountry}}ఎలాంటి అనుమతులు లేకుండా…. సుమారు 2500 ఏళ్ల చరిత్ర కలిగిన హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ, వందలాది చెట్లను నరికివేసి విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. 'సేవ్ ది రాక్స్ సొసైటీ', పర్యావరణ వేత్తలు, స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగి చర్యలు తీసుకుందని వివరించారు.
అడ్డుపడటమే నేను చేసిన తప్పు - రంగనాథ్
“వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చట్టాల పట్ల గౌరవంతో పని చేస్తూ వస్తున్నాను. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100 శాతం ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటాను. అలాగే పని చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తాను” అని రంగనాథ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అంతకంటే ముందు హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలని సీఎస్‌ను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేసింది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్.. కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ స్పందిస్తూ…. ప్రకటన విడుదల చేశారు.