హైదరాబాద్‌లో భూ మాఫియా గుప్పిట ఉన్న ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా (Hydraa - Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) సరికొత్త రికార్డు సృష్టించింది. ఆక్రమణదారుల చెర నుంచి విలువైన ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను కాపాడుతూ సరికొత్త మైలురాయిని అధిగమించింది.

గడిచిన రెండేళ్ల కాలంలోనే ఏకంగా రూ. 1,10,000 కోట్ల (లక్షా పది వేల కోట్లు) విలువైన ప్రభుత్వ భూములను విడిపించి, తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారికంగా ప్రకటించారు.
హైదరాబాద్ నగర ప్రజల నుంచి లభించిన అపారమైన మద్దతు, ప్రోత్సాహం వల్లే ఈ అసాధ్యమైన టాస్క్ సాధ్యమైందని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. ఇదే వేగంతో ముందుకు సాగుతూ, వచ్చే ఏడాది నాటికి కబ్జాదారుల నుంచి రక్షించిన ఆస్తుల విలువను రూ. 2 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. భూ మాఫియా నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించాలంటే కేవలం అధికారుల శ్రమ మాత్రమే సరిపోదని, ఇందులో ప్రజలు, మీడియా భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో కేవలం భవనాల కూల్చివేతలు మాత్రమే హైడ్రా పనికాదని, పర్యావరణ పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని కమిషనర్ వివరించారు. నగరంలో కాంక్రీట్ జంగిల్ పెరిగిపోకుండా, పర్యావరణాన్ని కాపాడుతామన్నారు. కబ్జాలకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను క్లెయిమ్ చేసి, వాటి పూర్వ వైభవాన్ని తీసుకురావడం, భవిష్యత్తు అవసరాల కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి, రక్షించడం హైడ్రా చేస్తోంది.
ఇటీవలి కాలంలో హైడ్రా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో వేలాది కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంది. కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగితోపాటుగా మరిన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భుములను రక్షించింది.
{{/usCountry}}ఇటీవలి కాలంలో హైడ్రా ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రియల్ ఎస్టేట్ పరంగా అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలలో వేలాది కోట్ల విలువైన భూములను స్వాధీనం చేసుకుంది. కోకాపేట, పుప్పాలగూడ, నార్సింగితోపాటుగా మరిన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భుములను రక్షించింది.
{{/usCountry}}ఈ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రా సిబ్బంది, ఆయా భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ ఆక్రమణలకు గురికాకుండా ఉండటం కోసం సదరు భూముల చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇవి "ప్రభుత్వ స్థలాలు - అక్రమంగా ప్రవేశిస్తే కఠిన చర్యలు ఉంటాయ్" అని హెచ్చరిస్తూ పెద్ద ఎత్తున బోర్డులను పాతారు.
హైదరాబాద్ మహా నగరంలో వరదలు రాకుండా ఉండాలన్నా, భూగర్భ జలాలు పెరగాలన్నా నాలాలు, చెరువుల సంరక్షణ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో హైడ్రా తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు, రికార్డు స్థాయి రికవరీలు అక్రమార్కులకు బలమైన హెచ్చరికగా నిలుస్తున్నాయి. భూ ఆక్రమణలపై ఫిర్యాదులు చేయడానికి లేదా సమాచారం అందించడానికి నగర ప్రజలు నేరుగా హైడ్రా అధికారులను సంప్రదించవచ్చు. అంతేకాదు హైడ్రా చెరవులను పునరుద్ధర చేస్తోంది. బతుకమ్మ కుంటలాంటి చెరవును ఇప్పుడు అందంగా తీర్చిదిద్దింది.