HYDRAA : ‘అలాంటి భూములు, ఇండ్ల జోలికి వెళ్లం’… గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా

HYDRAA On Urban Land Ceiling Lands :  యూఎల్‌సీ భూముల్లోని ఇండ్లు, ఖాళీ జాగలపై హైడ్రా కీలక ప్రకటన చేసింది. అలాంటి వాటి జోలికి హైడ్రా వెళ్ల‌దని స్పష్టం చేసింది. ఈ తరహా భూముల విషయంలో కొంత‌మంది చేస్తున్న ప్రచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది.

Published on: Apr 5, 2026, 13:36:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

యూఎల్‌సీ(అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్‌) భూముల్లోని పాత లే ఔట్ల‌లో ఇళ్ల‌నే కాదు.. ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి వెళ్ల‌మని హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్ల‌లో రెగ్యుల‌రైజ్ కాని ఖాళీ ప్లాట్ల‌పై చ‌ర్య‌లుండ‌వ‌ని స్ప‌ష్టంగా పేర్కొంది.

హైడ్రా కీలక ప్రకటన
హైడ్రా కీలక ప్రకటన

అలాంటి వాటిని నమ్మకండి - హైడ్రా

యూఎల్‌సీ భూముల్లో వెల‌సిన లే ఔట్ల‌లో ఖాళీగా ఉన్న‌ ప్లాట్ల‌ను హైడ్రా పేరు చెప్పి ఆక్ర‌మించేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని న‌గ‌ర ప్రజ‌ల‌ను కోరింది. ఈ విష‌యంలో ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి నివృత్తి చేసుకోవాల‌ని సూచించింది.

లే ఔట్ ప్ర‌కారం ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జా కాకుండా కాపాడుతుంద‌ని హైడ్రా స్ప‌ష్టం చేసింది. హైడ్రా ఏర్ప‌డ‌డానికి (19.7.2024) ముందు నివాసాలుంటే వాటిని కూల్చ‌మ‌ని ఇప్ప‌టికే చాలాసార్లు స్ప‌ష్టం చేశామని పేర్కొంది. ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు ఇదే విధానాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నామని తెలిపింది.

ఈ మ‌ధ్య కాలంలో శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని ప‌లు యూఎల్‌సీ భూముల్లో వేసిన‌ లే ఔట్ల‌లో పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను మాత్ర‌మే తొల‌గించామని హైడ్రా పేర్కొంది. కొండాపూర్ గ్రామంలోని రాజ‌రాజేశ్వ‌రిన‌గ‌ర్‌, ఓయూ కాల‌నీ, రాఘ‌వేంద్ర కాల‌నీలోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపే ఇందుకు నిద‌ర్శ‌నమని వివరించింది.

కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం హైద‌ర్‌న‌గ‌ర్‌లోని యూఎల్‌సీ భూముల్లో వెల‌సిన గోపాల్‌న‌గ‌ర్ లే ఔట్‌లో పార్కును కూడా ఇదే మాదిరిగా కాపాడామని హైడ్రా గుర్తు చేసింది. యూఎల్ సీ భూముల్లోని లే ఔట్ల‌లో రెగ్యుల‌రైజ్ కాని ప్లాట్ల‌ను హైడ్రా తీసుకుని ప్ర‌భుత్వానికి అప్ప‌జెబుతుంద‌ని కొంత‌మంది క‌బ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది. మీ ఇంటి స్థ‌లాన్ని త‌క్కువ ధ‌ర‌కు సొంతం చేసుకోవాల‌నే కుట్ర‌కోణం ఉంద‌నే విష‌యాన్ని గ్ర‌హించాల‌ని హైడ్రా కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More