HYDRAA : పాతబస్తీలో భారీ ఆపరేషన్ - రూ. 100 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా పాతబస్తీలో భారీ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా… క్రీడామైదానంలో అక్రమ కట్టడాలను తొలగించింది. రూ. 100 కోట్ల ఆస్తిని కాపాడింది.
పాతబస్తీ మైలర్దేవుపల్లిలో హైడ్రా భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6500 గజాల క్రీడమైదానాన్ని కాపాడింది. దీని విలువ రూ. 100 కోట్లవరకు వుంటుందని అంచనా. HMDA అనుమతి పొందిన లేఔట్లో స్పష్టంగా క్రీడామైదానం అని పేర్కొన్నా… ఆక్రమణలు చేయటంతో కూల్చివేతలు చేపట్టారు.

అక్రమ నిర్మాణాలు తొలగింపు…
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మైలార్దేవుపల్లి విలేజ్ శాస్త్రిపురం కాలనీలో హైడ్రా బుధవారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. 188 ఎకరాల హుడా అనుమతి పొందిన లేఔట్లో క్రీడాస్థలం కోసం కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. జీ ప్లస్ 3 అంతస్తుల నిర్మాణ దశలో ఉన్న భవనాలు ఐదింటిని హైడ్రా తొలగించింది. మరో రెండు సింగిల్ రూమ్ నిర్మాణాలను తొలగించింది.
1800 ల ప్లాట్లకు పైగా ఉన్న ఈ లేఔట్ ప్రకారం 6500 గజాల స్థలాన్ని ప్లే గ్రౌండ్ కోసం కేటాయించారు. క్రీడా స్థలానికి కేటాయించిన స్థలం అని తెలిసి కూడా గత 3 సంవత్సరాలుగా నోటరీ మీద స్థానికంగా ఉన్న కబ్జాదారులు ప్లాట్లుగా అమ్మేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ గతంలో నోటీసులు కూడా ఇచ్చింది. 2024లో కూల్చివేస్తామని చేస్తామని ఆర్డర్లు కూడా జారీ చేసింది. అయినా పట్టించుకోకుండా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి.
ఇదే విషయమై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు GHMC, రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పరిశీలించింది. లేఔట్ ప్రకారం క్రీడాస్థలం కోసం కేటాయించిందని నిర్ధారణ చేసుకుంది. నిర్మాణాలు చేపట్టవద్దని వెంటనే హైడ్రా హెచ్చరించింది. బుధవారం ఉదయం ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 5 నిర్మాణంలో ఉన్న భావనలతో పాటు రెండు చిన్న గదులతో నిర్మించిన వాటిని తొలగించింది. ఇంకో రెండు భవనాల్లో ఇప్పటికే నివాసాలు ఉండడంతో వాటిని మినహాయించింది. హైడ్రాకు ఫిర్యాదు చేయగానే చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసినట్లు హైడ్రా తెలిపింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

