HYDRAA : రూ. 3200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ - 16 ఎకరాలను కాపాడిన హైడ్రా

ప్రభుత్వ భూముల అక్రమణాలపై హైడ్రా దూకుడు కొనసాగుతోంది. తాజాగా శేరిలింగంపల్లిలోని టీ ఎన్ జీ వో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మార్కెట్ వాల్యూ ప్రకారం… ఈ భూమి విలువ రూ. 3200గా ఉంటుంది.

Published on: Mar 20, 2026, 22:39:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీ ఎన్ జీ వో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. TNGO ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతంలో కొంత భూమిని కేటాయించింది. 2007 వేసిన HMDA లే ఔట్ లో 10 ఎకరాల ముసాయికుంటగా పేర్కొన్నారు. ఆ పక్కనే 4 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా గా ప్రకటించారు. అలాగే 2 ఎకరాలు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు.

16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
16 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

ఇలా కేటాయింపులు జరగగా….ఈ భూమి ఆక్రమణలకు గురి అవుతోందని ప్రజావాణిలో ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. GHMC, రెవెన్యూ విభాగాలతో కలసి క్షేత్ర స్థాయిలో విచారించింది. ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కొంతమంది ఈ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.

16 ఎకరాలకు ఫెన్సింగ్…

ఈ ఫిర్యాదులను హైడ్రా క్షుణ్ణంగా పరిశీలించింది. ఆక్రమణలను నిర్ధారించుకుని మొత్తం 16 ఎకరాల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. 10 ఎకరాల ముసాయికుంటతో పాటు గ్రీన్ బెల్ట్ ఏరియాకు కేటాయించిన 4 ఎకరాలను కాపాడినందుకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారని హైడ్రా ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More