పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్, బుధవారం జరగాల్సిన పోలీసు విచారణకు గైర్హాజరయ్యాడు. తన వ్యక్తిగత కారణాల దృష్ట్యా అధికారుల ముందుకు రాలేకపోతున్నానని పేర్కొంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఒక ఈ-మెయిల్ పంపాడు.
మెయిల్‌లో ఏముంది?

పోలీసు నోటీసులకు స్పందిస్తూ భగీరథ్ తన మెయిల్‌లో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను సేకరించాల్సి ఉందని, అందుకోసం తనకు మరో రెండు రోజుల సమయం కావాలని కోరాడు. దర్యాప్తునకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, సంబంధిత అధికారుల ఎదుట తప్పకుండా హాజరవుతానని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం హాజరు కాలేనని, విచారణ కోసం మరొక తేదీని చెప్పాలని విజ్ఞప్తి చేశాడు..
భగీరథ్ గడువు కోరడంపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇప్పటికే బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కఠినమైన పోక్సో సెక్షన్లు నమోదు చేశారు దర్యాప్తు అధికారులు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో పోక్సో చట్టంలోని అత్యంత కఠినమైన సెక్షన్ 5(l) రెడ్‌విత్ 6ను కూడా అదనంగా చేర్చారు. దీనివల్ల కేసు తీవ్రత మరింత పెరిగింది. ఇక తాజాగా భగీరథ్ విన్నపాన్ని మన్నిస్తారా లేదా తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారా అన్నది వేచి చూడాలి.
మరోవైపు ఈ కేసులో అరెస్టు భయంతో భగీరథ్ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్.ఐ.ఆర్ (FIR)ను కొట్టివేయాలని, లేదా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ మే 14న (గురువారం) వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, సమగ్ర విచారణ కోసం కుకట్‌పల్లి డీసీపీ రీతిరాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో బండి భగీరథ్ పోక్సో కేసు మీద చర్చ ఎక్కువగా నడుస్తోంది.
17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్‌హౌస్‌లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}17 ఏళ్ల బాలికను మభ్యపెట్టి, ఫామ్‌హౌస్‌లలో లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదుతో మే 8న ఈ కేసు నమోదైంది. మరోవైపు భగీరథ్ తరపున ఇది 'హనీ ట్రాప్' అని, తనను బ్లాక్ మెయిల్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఈ రెండు కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
{{/usCountry}}