హైదరాబాద్ పోలీసులు ఘోస్ట్ పెయిరింగ్ అనే కొత్త వాట్సాప్ స్కామ్ గురించి వినియోగదారులను హెచ్చరించారు. ఇది నకిలీ లింక్‌ల ద్వారా ఖాతాలను హైజాక్ చేయడానికి యాప్ డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ స్కామ్ సోషల్ ఇంజనీరింగ్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిని సైబర్ భద్రతా నిపుణులు ఘోస్ట్ పెయిరింగ్ స్కామ్ అంటున్నారు. ఇది పాస్‌వర్డ్, ఓటీపీ లేదా సిమ్ మార్చడం అవసరం లేకుండా ఒక వ్యక్తి వాట్సాప్ ఖాతాను పూర్తిగా యాక్సెస్ చేస్తుంది. ఇందుకోసం డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను వాడుకుంటుంది.

దీనిపై హైదరాబాద్ పోలీసులు ఒక సలహా జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వీసీ సజ్జనార్ ఎక్స్ ద్వారా పౌరులను కొత్త స్కామ్ గురించి హెచ్చరించారు. Hey, I just found your photo అని లింక్‌తో మెసేజ్ వస్తుంది. మీకు తెలిసిన వారి నుండి వచ్చినట్లు కనిపించినప్పటికీ దాన్ని క్లిక్ చేయవద్దు.
ఈ లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారులు అధికారిక ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లాగా కనిపించే ఫేక్ వెబ్‌పేజీకి వెళ్తుంది. కంటెంట్‌ను చూడటానికి ముందుగా వెరిఫై చేయాలని చెబుతుంది. బ్యాంక్ ఎండ్‌లో ఘోస్ట్ పెయిరింగ్ ప్రక్రియ మెుదలవుతుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలనే రిక్వెస్ట్ వస్తుంది. అనంతరం న్యూమరిక్ పెయిరింగ్ కోడ్‌ను వాట్సాప్ జనరేట్ చేస్తోంది. ఈ కోడ్‌ను వాట్సాప్‌లో నమోదు చేయాలని నకిలీ పేజీలోనే రిక్వెస్ట్ కనిపిస్తుంది. ఈ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే స్కామర్ డివైజ్‌కు మన వాట్సాప్ లింక్ అయిపోతుంది. వాట్సాప్ మెుత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఇది మెుత్తం డివైజ్ లింకింగ్ ఫీచర్‌తో చేస్తారు.
GhostPairing పూర్తిగా సోషల్ ఇంజనీరింగ్‌పై ఆధారపడుతుంది. సైబర్ నేరగాళ్లు.. బాధితులను స్వయంగా డివైజ్‌ను ఆమోదించేలా మోసగిస్తారు. దీని వలన మీ వాట్సాప్ హ్యాక్ అయినట్టుగా గుర్తించడం కష్టతరం అవుతుంది. వాట్సాప్ ఖాతా వారి చేతుల్లోకి వెళ్లిన తర్వాత స్కామర్లు బాధితుడి పరిచయాలు, గ్రూప్ చాట్‌లకు అలా హానికరమైన లింక్‌లను పంపడానికి ఉపయోగిస్తారు.
'తెలిసిన వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు క్లిక్ చేసే అవకాశం చాలా ఎక్కువ. దీని వలన స్కామ్ ఎక్కువగా జరుగుతుంది.' అని సైబర్ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}'తెలిసిన వ్యక్తుల నుండి వచ్చే సందేశాలు క్లిక్ చేసే అవకాశం చాలా ఎక్కువ. దీని వలన స్కామ్ ఎక్కువగా జరుగుతుంది.' అని సైబర్ భద్రతా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
{{/usCountry}}ఈ స్కామ్ నుండి దూరంగా ఉండటానికి వినియోగదారులు వాట్సాప్ లింక్డ్ డివైజెస్‌ను తప్పనిసరిగా చెక్ చేస్తూ ఉండాలి. మీకు తెలియకుండా ఎందులోనైనా లింక్ అయి ఉంటే వెంటనే లాగౌట్ కొట్టేయండి. ఏవైనా తెలియనివి ఉంటే తొలగించుకోవాలి. కోడ్‌లను నమోదు చేయడం, QR కోడ్‌లను స్కాన్ చేయడం, వెరిఫై చేసుకోండిలాంటి మెసేజులు వస్తే వాటి జోలికి వెళ్లకూడదు.