...
...
Next Story

IGNOU Admissions 2026 : ఇగ్నోలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు - దరఖాస్తు గడువు పొడిగింపు

IGNOU July 2026 Admissions : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU)లో డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జూలై 2026 అడ్మిషన్ సెషన్ ఆన్‌లైన్ కోర్సుల దరఖాస్తు గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.

Published on: Sep 1, 2026, 20:05:44 IST
Advertisement

IGNOU July 2026 Admissions : దూర విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జులై 2026 అడ్మిషన్ సైకిల్ పరిధిలోని పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించింది. డిగ్రీ, పీజీతో పాటు వివిధ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు సెప్టెంబర్ 15, 2026 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో అధికారిక అడ్మిషన్ పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఇగ్నోలో ప్రవేశాలు 2026
ఇగ్నోలో ప్రవేశాలు 2026

ఈ పెంచిన దరఖాస్తు గడువు కేవలం యూజీ, పీజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు మాత్రమే వర్తిస్తుంది. సర్టిఫికేట్ ప్రోగ్రాములకు ఈ గడువు పెంపు వర్తించదు.

  • బ్యాచిలర్ డిగ్రీలు : బీఏ , బీకాం, బీసీఏ , బీబీఏ మొదలైన డిగ్రీ కోర్సులు.
  • మాస్టర్ డిగ్రీలు : ఎంఏ, ఎంకాం , ఎంసీఏ, ఎంబీఏ , ఎంఎస్సీ (MSc) తదితర పీజీ కోర్సులు.
  • పీజీ డిప్లొమా కోర్సులు : విభిన్న స్పెషలైజేషన్లలో అందుబాటులో ఉన్న పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లు.
  • డిప్లొమా కోర్సులు : పలు రకాల వృత్తి నైపుణ్యం ఆధారిత డిప్లొమా కోర్సులు.

దరఖాస్తు విధానం….

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకునేందుకు ఇగ్నో స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించే ముందు అభ్యర్థులు తమ APAAR ID ని సిద్ధంగా ఉంచుకోవాలని ఇగ్నో సూచించింది.

  • మొదట ఇగ్నో అధికారిక అడ్మిషన్ పోర్టల్ ignouadmission.samarth.edu.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • ఆన్‌లైన్ పోర్టల్‌లో కొత్తగా రిజిస్టర్ చేసుకుని, మీరు చేరాలనుకుంటున్న కోర్సు, యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ మొదలైన ప్రాథమిక వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలు నమోదు చేశాక 'SUBMIT' బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఈ-మెయిల్‌కు అడ్మిషన్ లాగిన్ వివరాలు వస్తాయి.
  • ఆ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లతో పోర్టల్‌లోకి లాగిన్ అయి దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత, విద్యా సంబంధిత సమాచారాన్ని నింపాలి.
  • విశ్వవిద్యాలయం సూచించిన ఫార్మాట్ మరియు సైజులో ఫొటో, సంతకం, కేటగిరీ సర్టిఫికేట్, గుర్తింపు కార్డ్ (ఫొటో ఐడీ) తదితర ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • అధికారికంగా అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పేమెంట్ మోడ్స్ (నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్) ద్వారా నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్‌ను ఫైనల్ సబ్మిట్ చేసేముందు 'Preview' ఆప్షన్ ద్వారా మీరు నమోదు చేసిన ప్రతీ వివరాలు కచ్చితంగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.
  • దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తు కాపీని డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసి భద్రపరుచుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe