ఐఐటీ హైదరాబాద్‌లో 'గుడ్‌నెస్‌'పై భారతదేశంలోనే మొట్టమొదటి అకడమిక్ కోర్సు

IIT Hyderabad Goodness Course : విద్యార్థులు కేవలం విద్యా, వృత్తి నైపుణ్యాలపై మాత్రమే దృష్టి పెట్టడం కాదు. మానవీయ విలువలను కూడా సరిగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఐఐటీ హైదరాబాద్ కొత్త కోర్సును తీసుకొచ్చింది.

Updated on: Oct 23, 2026, 12:45:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఐఐటీ హైదరాబాద్ కేవలం విద్య, వృత్తిపరమైన నైపుణ్యాలకే పరిమితం కాకుండా విద్యార్థులలో మానవతా విలువలు, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే దిశగా ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దేశంలోనే తొలిసారిగా "మంచితనం" (Goodness) అనే అంశంపై క్రెడిట్ పొందేందుకు వీలుగా ఒక ప్రత్యేక అకడమిక్ కోర్సును ప్రారంభించింది.

ఐఐటీ హైదరాబాద్
ఐఐటీ హైదరాబాద్

"గుడ్‌నెస్: క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ అండ్ హ్యూమన్ ఫ్లోరిషింగ్" (Goodness: Character, Responsibility and Human Flourishing - LA2270) పేరుతో ఈ ఒక క్రెడిట్ (1-Credit Elective) ఆప్షనల్ కోర్సును అధికారులు ప్రవేశపెట్టారు.

ఈ కోర్సును బి.టెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, బి.డిజైన్ (BDes) చదువుతున్న విద్యార్థులందరూ ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి ముందస్తు అర్హతలు అవసరం లేదు. ఐఐటీ హైదరాబాద్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కోర్సు ప్రారంభమైన వెంటనే 140 మందికి పైగా విద్యార్థులు దీనిలో చేరడం విశేషం.

ఈ కోర్సును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్‌నెస్ ప్రతిపాదించగా ఐఐటీ హైదరాబాద్ దీనిని ఆమోదించి అధికారిక అకడమిక్ క్రెడిట్ కోర్సుగా అమలు చేస్తోంది.

కేవలం ఆదాయం, పదవులే విజయం అనుకునే ఈ రోజుల్లో అసలైన మంచి జీవితం అంటే ఏమిటి? సమాజం పట్ల ఒక వ్యక్తికి ఉండాల్సిన బాధ్యతలేంటి? అనే అంశాలపై విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం. మొత్తం 7 సెషన్లలో సాగే ఈ కోర్సులో పలు అంశాలను కవర్ చేస్తారు.

  • గుడ్‌నెస్ ఇండెక్స్ ఫ్రేమ్‌వర్క్: మంచితనాన్ని అంచనా వేసే విధానం.

హ్యూమన్ ఫ్లోరిషింగ్: జీవితంలోని శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక మరియు ఆధ్యాత్మిక పరిమాణాలు.

క్యారెక్టర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవిడెండ్: వ్యక్తిత్వ నిర్మాణం, దాని వల్ల సమాజానికి జరిగే ప్రయోజనం.

పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ: వ్యక్తిగత సామాజిక బాధ్యత.

వికసిత్ భారత్ : మంచితనానికి, నవ భారత నిర్మాణానికి ఉన్న సంబంధం.

విద్యార్థులకు ఏదో ఒక నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని రుద్దకుండా, మంచితనాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించడం, రోజువారీ జీవితంలో దానిని ఎలా ఆచరణలో పెట్టవచ్చో తెలుసుకోవడానికి ఈ కోర్సు తోడ్పడుతుంది. కేవలం థియరీగా నేర్చుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో తాము ఎలాంటి భారతదేశాన్ని నిర్మించాలనుకుంటున్నారనే అంశంపై విద్యార్థుల రిఫ్లెక్షన్‌తో ఈ కోర్సు ముగుస్తుంది.

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక స్పృహ ఉన్న ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడంలో ఐఐటీ హైదరాబాద్ చేపట్టిన ఈ ప్రయోగం దేశవ్యాప్తంగా విద్యావేత్తల ప్రశంసలు అందుకుంటోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More