...
...
Next Story

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టు.. డిసెంబర్ 22న ఇంటర్వ్యూ

ఐఐటీ హైదరాబాద్‌లో పని చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసిస్టెంట్ భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

Published on: Dec 10, 2025, 21:30:12 IST
Advertisement

ఐఐటీ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఖాళీ భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీని భర్తీ చేస్తారు. ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన 1 ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేస్తున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం ఈ సంస్థ అర్హతగల భారతీయులను ఆహ్వానిస్తుంది. పదకొండు నెలల పాటు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి పనితీరు, సంస్థ అవసరాలకు లోబడి పదవీకాలాన్ని మరింత పొడిగించవచ్చు.

ఐఐటీ హైదరాబాద్
ఐఐటీ హైదరాబాద్

గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ ఉన్నవారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు తమ విద్యార్హతలు, అనుభవాన్ని ధృవీకరించే ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ (ప్రకటనతో జతచేసిన ఫార్మాట్)తో హాజరు కావాలి. ఇంటర్వ్యూ వేదిక సెనేట్ హాల్, అడ్మినిస్ట్రేటివ్ భవనం, ఐఐటీ హైదరాబాద్, కంది, సంగారెడ్డి, తెలంగాణ-502284గా ఉంది.

అడ్మినిస్ట్రేషన్ / ఐటీ / విద్యాసంస్థలలో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో బ్యాచిలర్ డిగ్రీ లేదా అడ్మినిస్ట్రేషన్ / ఐటీ/ విద్యాసంస్థలలో కనీసం 1 సంవత్సరం అనుభవంతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఆంగ్లంలో రాయగలగాలి, మాట్లాడే ప్రావీణ్యం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ల గురించి తెలియాలి. విద్యాసంస్థలో అంతర్జాతీయ సంబంధాల కార్యకలాపాలను నిర్వహించడంలో లేదా మద్దతు ఇవ్వడంలో ముందస్తు అనుభవం అవసరం. వెబ్‌సైట్ డిజైన్ నిర్వహణ, విదేశీ ప్రవేశాలలో అనుభవం‌తో మరికొన్ని అర్హతలు కావాలి.

దరఖాస్తుదారుడు భారత పౌరుడు అయి ఉండాలి. వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందు, అభ్యర్థి తాను దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్ కోసం అన్ని అర్హత ప్రమాణాలను కన్ఫామ్ చేయాలి. అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌లో అందించిన సమాచారం ఆధారంగా ఇంటర్వ్యూ హాజరు కావడానికి అనుమతిస్తారు. దరఖాస్తుదారు అందించిన సమాచారం తప్పు అని తేలితే, నియామక ప్రక్రియ ఏ దశలోనైనా అభ్యర్థిత్వం రద్దు చేస్తారు. ఒకవేళ పోస్టులో నియమించిన తర్వాత తెలిస్తే.. ఎటువంటి నోటీసు లేదా పరిహారం లేకుండా సేవలు రద్దు చేస్తారు.

ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ చదవండి

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks