...
...
Next Story

Weather Update : వాతావరణ హెచ్చరిక.. తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

Weather Update : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఇది తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత వాతావరణ పరిస్థితుల్లో మరింత మార్పు రానుంది.

Published on: Jul 27, 2026, 14:15:22 IST
Advertisement

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం కారణంగా తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని కూడా పేర్కొంది. జూలై 30వ తేదీ దాకా వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, నారాయణపేటలో కూడా వానలు పడనున్నాయి.

తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లోనూ వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, మాదాపూర్‌, కూకట్‌పల్లి, మియాపూర్‌, గచ్చిబౌలి, ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌లలో సోమవారం ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు.. అనవసరంగా బయటకు రావడం మానుకోవాలని సూచించారు.

జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలను అప్రమత్తం అయ్యారు. డ్రైనేజీ వ్యవస్థలలో నీరు నిలవడాన్ని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా గత 24 గంటల్లో తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి మండలం జగ్గసాగర్‌లో అత్యధికంగా 7.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగరంలో 1.6 నుంచి 2.7 సెం.మీ మధ్య వర్షపాతం నమోదు కాగా, హయత్‌నగర్‌లో అత్యధికంగా 2.7 సెం.మీ, పెద్ద అంబర్‌పేటలో 1.8 సెం.మీ, బండ్లగూడ, పసుమాములలో 1.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe