...
...
Next Story

కొనసాగుతున్న చలి తీవ్రత - తెలంగాణలోని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో శీతల గాలులు వీస్తుండగా… మరికొన్నిచోట్ల మంచు తీవ్రత ఎక్కువగా ఉంటోంది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Dec 18, 2025 04:59 PM IST
Advertisement

తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది. కొన్నిచోట్ల సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్నిచోట్ల ఉదయం, రాత్రి సమయంలో మంచు కురుస్తోంది. ఉదయం సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎల్లో హెచ్చరికలు జారీ…

తెలంగాణలో శీతల గాలులు - ఎల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో శీతల గాలులు - ఎల్లో హెచ్చరికలు జారీ

రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలుచోట్ల శీతల గాలులు వీచే అవకాశం ఉంది. అక్కడకక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో శీతల గాలులు వీచే ఛాన్స్ ఉండగా... ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

రేపు ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక హైదరాబాద్ లోని వాతావరణం చూస్తే….. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉపరితల గాలులు ఈశాన్య దిశలో గంటకు 4-6 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.

మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చలి తీవ్రతకు గ గజ వణికిపోతుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలల సమయాలను సవరించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తరగతులు ఉదయం ఆలస్యంగా ప్రారంభమవుతాయి. జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe