...
...
Next Story

తెలంగాణపై తుఫాన్ ప్రభావం - ఈనెల 27 నుంచి మళ్లీ వర్షాలు..!

రాబోయే రోజుల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ మేరకు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

Published on: Oct 23, 2026, 18:32:46 IST
Advertisement

బంగాళాఖాతంలోని అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లోని వివిక్త ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది,

  • అక్టోబర్ 24 ఉదయం నుంచి అక్టోబర్ 26 ఉదయం వరకు చూస్తే…. ఈ మూడు రోజుల వ్యవధిలో తెలంగాణవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో వాతావరణ శాఖ ఎలాంటి వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు.
  • అక్టోబర్ 27వ తేదీ నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
  • ఇక అక్టోబర్ 28వ తేదీన పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలుండగా… కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చు.
  • అక్టోబర్ 29, 30 తేదీల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

తుఫాన్ ప్రభావాన్ని బట్టి వాతావరణ పరిస్థితుల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో మరిన్ని జిల్లాల్లో కూడా వర్షాలు ఉండొచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks