...
...
Next Story

IMD Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ - అక్టోబర్ 2 నుంచి మళ్లీ వర్షాలు..! హెచ్చరికలు జారీ

Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

Published on: Sep 30, 2026, 10:03:20 IST
Advertisement

Telangana Weather Updates : రాష్ట్రంలో మళ్లీ వాతావరణం మారనుంది. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా…. అక్టోబర్ 2వ తేదీ నుంచి మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

అక్టోబర్ 2 నుంచి వర్షాలు…

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

ఇవాళ రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యే సూచనలున్నాయి. రేపు కూడా ఇదే మాదిరి పరిస్థితి ఉండే అవకాశం ఉంది.

  • ఇక అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 3 వరకు… తిరిగి రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
  • అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 4 వరకు…. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
  • అక్టోబర్ 4 నుండి అక్టోబర్ 6 వరకు…. రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వర్షాల తీవ్రతను బట్టి ప్రజలు, వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. కుండపోత లేదా భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉంది. దీంతో నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. తడి మరియు జారే రోడ్ల పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని… ఈదురుగాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks