తెలంగాణలో 2026 నైరుతి రుతుపవనాల సీజన్ సాధారణం కంటే 18 శాతం తక్కువ వర్షపాతంతో ముగిసింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో లోటు తీవ్రత పెరిగింది. గతంలోని అనేక ఎల్ నినో సంవత్సరాలతో పోలిస్తే ఈ లోటు తక్కువగా ఉన్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా వర్షపాత పంపిణీలో అసమానతలు కనిపించాయి.

జూన్ నుండి సెప్టెంబర్ వరకు తెలంగాణలో 615.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ స్థాయి అయిన 740.6 మి.మీ కంటే 125.1 మి.మీ తక్కువ. రుతుపవనాల ప్రారంభంలో స్వల్ప లోటు ఉన్నప్పటికీ, జూలైలో పరిస్థితి దాదాపు సాధారణ స్థితికి చేరుకుంది. అయితే ఆగస్టులో వర్షపాతం గణనీయంగా తగ్గడం, సెప్టెంబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షం కురవడంతో మొత్తం సీజన్ లోటు పెరిగింది.
2026 సీజన్ విషయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లోటు అనేది ఏకరీతిగా కొనసాగలేదు. జూలైలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ ఆగస్టులో వర్షపాతం భారీగా తగ్గడం మొత్తం మారిపోయింది. గతంలోని ఎల్ నినో సంవత్సరాలలో తెలంగాణలో 1997లో 33 శాతం, 2002లో 32 శాతం, 2004లో 36 శాతం, 2009లో 31 శాతం లోటు నమోదైంది. 2026 నాటి లోటు ఆ నాలుగు సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, 2015లో నమోదైన 14 శాతం లోటు కంటే కొంచెం ఎక్కువగా ఉంది.
2023తో పోలిస్తే ఈ వ్యత్యాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఏడాది సాధారణ వర్షపాతం 738.6 మి.మీ కాగా, తెలంగాణలో 861.1 మి.మీ వర్షపాతం నమోదై, 17 శాతం అధిక వర్షపాతంతో సీజన్ ముగిసింది. కానీ 2026లో నాలుగు నెలల్లోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది(అయితే జూలైలో లోటు చాలా స్వల్పంగా ఉంది).
పదిహేను జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 18 జిల్లాల్లో వర్షపాతం లోటుతో ముగిసింది. జోగులాంబ గద్వాల్లో అత్యధికంగా 41 శాతం లోటు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో నారాయణపేట, హనుమకొండలు ఉన్నాయి. నల్గొండలో 34 శాతం లోటు నమోదైంది. సిద్దిపేటలో 10 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, మెదక్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
{{/usCountry}}పదిహేను జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. 18 జిల్లాల్లో వర్షపాతం లోటుతో ముగిసింది. జోగులాంబ గద్వాల్లో అత్యధికంగా 41 శాతం లోటు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో నారాయణపేట, హనుమకొండలు ఉన్నాయి. నల్గొండలో 34 శాతం లోటు నమోదైంది. సిద్దిపేటలో 10 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, మెదక్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.
{{/usCountry}}హైదరాబాద్‌లో సాధారణ వర్షపాతం 627.2 మి.మీ. కాగా, 458.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 27 శాతం లోటు. మేడ్చల్-మల్కాజిగిరిలో 33 శాతం, రంగారెడ్డిలో 14 శాతం లోటు నమోదైంది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రాంతాల్లో వర్షపాతం సాధారణం కంటే 26 శాతం తక్కువగా ఉంది. 2023లో హైదరాబాద్‌లో 25 శాతం అధిక వర్షపాతం నమోదైన దానికి ఇది విరుద్ధం. ఈ వ్యత్యాసం కేవలం సీజనల్ మొత్తం వర్షపాతంలోనే కాకుండా, వర్షపాత పంపిణీలో కూడా స్పష్టంగా కనిపించింది.
ఈసారి చలి తక్కువే
మరోవైపు శీతాకాలం ఔట్ లుక్‌ను వాతావరణ శాఖ విడుదల చేసింది. వానాకాలం ముగిసి నేటి నుంచి శ్రీతాకాలం ప్రారంభమైనట్టుగా వెల్లడించింది. ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని తెలిపింది. అక్టోబర్‌లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబర్ నుంచి డిసెంబర్ సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుంది.