హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్ల కేటాయింపు పేరుతో జరిగే మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ హెచ్చరించారు. లబ్ధిదారుల నుండి రూ.10,000 ముందస్తు డిపాజిట్ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన దృష్ట్యా సైబర్ నేరగాళ్లు నకిలీ ఫోన్ కాల్స్, గుర్తుతెలియని లింకుల ద్వారా ప్రజలను బురిడీ కొట్టించే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ పథకంలో దళారులు లేదా మధ్యవర్తులకు ఎలాంటి తావులేదని, ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని సీపీ తెలిపారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారులు చెల్లించే ఈఎమ్‌డీ సొమ్ము సురక్షితంగా ఉంటుందన్నారు. ఒకవేళ ఇల్లు కేటాయించకపోతే ప్రభుత్వం ఆ మొత్తాన్ని నేరుగా దరఖాస్తుదారుడి బ్యాంకు ఖాతాకే తిరిగి జమ చేస్తుందని వివరించారు.
డబ్బులు ఇస్తే కచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం అని నమ్మబలికే వారి మాటలను అస్సలు నమ్మవద్దని సీపీ సజ్జనార్ సూచించారు. ఈ రోజే ఆఖరి తేదీ, వెంటనే డబ్బులు చెల్లించకపోతే ఇల్లు రద్దవుతుంది అంటూ భయాందోళనలకు గురిచేసి, తొందరపాటుతో డబ్బులు బదిలీ చేయించడమే మోసగాళ్ల ప్రధాన వ్యూహమని హెచ్చరించారు.
వాట్సాప్ లేదా మెసేజ్‌ల ద్వారా వచ్చే తెలియని లింకులను క్లిక్ చేయడం, ఏపీకే (APK) ఫైళ్లను ఇన్‌స్టాల్ చేయడం వల్ల ఫోన్లు హ్యాక్ అయి, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని కమిషనర్ హెచ్చరించారు. అధికారిక ప్రభుత్వ పోర్టళ్లను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించి కూడా నేరగాళ్లు మోసం చేయవచ్చని తెలిపారు. సహాయం చేస్తున్నామనే పేరుతో ఎనీడెస్క్ లేదా టీమ్‌వ్యూయర్ వంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయించి బ్యాంకు వివరాలను దొంగిలిస్తారని పేర్కొన్నారు.
డబ్బులు చెల్లించడానికి మాత్రమే యూపీఐ పిన్ అవసరమవుతుందని, రిఫండ్ పొందడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు సజ్జనార్. వ్యక్తిగత గుర్తింపు కార్డులు, బ్యాంకు వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}డబ్బులు చెల్లించడానికి మాత్రమే యూపీఐ పిన్ అవసరమవుతుందని, రిఫండ్ పొందడానికి పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదని లబ్ధిదారులు గుర్తుంచుకోవాలన్నారు సజ్జనార్. వ్యక్తిగత గుర్తింపు కార్డులు, బ్యాంకు వివరాలు లేదా ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
{{/usCountry}}ఈ పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ప్రభుత్వం 040-24603572 అనే హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేసి పొగొట్టుకున్న సొమ్మును వెంటనే ఫ్రీజ్ చేయించుకోవాలని సీపీ సూచించారు.