...
...
Next Story

Inter Admissions 2026 : బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు.. మరికొన్ని రోజులే దరఖాస్తులు

Telangana Inter Admissions 2026 : బీసీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రాసెస్ నడుస్తోంది. మరికొన్ని రోజులే అప్లికేషన్ చేసేందుకు టైమ్ మిగిలి ఉంది. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలి.

Published on: May 5, 2026, 16:20:54 IST
Advertisement

మహాత్మా జ్యోతిభాపూలే తెలంగాణ బీసీ గురుకుల ఇంటర్మీడియట్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల కోసం విద్యార్దులు దరఖాస్తు చేసుకోవాలనీ హైదారాబాద్ ఉమ్మడి జిల్లాల బీసీ గురుకులo పాఠశాలలు, కళాశాలల రీజినల్ కో ఆర్డినేటర్ గౌతం కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోగా మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు
బీసీ గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లు

హైదారాబాద్ జిల్లాలో 14 బాలుర, 14 బాలికల కళాశాలలు(ఇంగ్లీష్ మీడియం) ఉన్నాయని, ఎంపీసీ, బైపిసి, సీఈసీ, హెచ్ఈసీ, ఈ సంవత్సరం ఏసీఈ కొత్త గ్రూప్ అందుబాటులో ఉన్నాయని గౌతం తెలిపారు. వృత్తి విద్యా కోర్సులో కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కూడా ఉన్నాయని వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో బీసీ గురుకులం కళాశాలల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. సొసైటీ పరిధిలో 290 కళాశాలల్లో 24,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. MPC, BPC, CEC, కొన్ని వృత్తి విద్యా కోర్సులు(Vocational Courses) అందుబాటులో ఉంటాయి.

  • బాలుర కళాశాలలు : 12,640+ సీట్లు
  • బాలికల కళాశాలలు : 12,000+ సీట్లు

దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు

  • పదవ తరగతి హాల్ టికెట్ నంబర్.
  • కులం ధృవీకరణ పత్రం (Caste Certificate).
  • ఆదాయ ధృవీకరణ పత్రం (Income Certificate).
  • ఆధార్ కార్డు వివరాలు.

ముఖ్య గమనిక

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఏప్రిల్‌ 22 నుంచి మే 12 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు 040-23328266 నెంబర్‌లో సంప్రదించాలి.

https://mjptbcwreis.telangana.gov.in (లేదా) https://mjptbcadmissions.org/MJP-Inter లో అప్లై చేసుకోవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe