తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రైవేట్ ఇంటర్ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. మార్చి 2026లో నిర్వహించే ఫైనల్ పరీక్షలకు హాజరు అయ్యేందుకు విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు దొరకనుంది. అయితే ఇందుకోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. నిజానికి ఇలాంటి అవకాశాన్ని చాలా కాలంగా ఇంటర్ బోర్డు అమలు చేస్తోంది. అయితే సైన్స్ విద్యార్థులకు ఇది వర్తించదు. ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు చదివే ప్రైవేట్ విద్యార్థులు హాజరు నుంచి మినహాయింపు ఉంటుంది.

హాజరు మినహాయింపు కోరుకునే విద్యార్థులు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు ప్రకటనలో తెలిపింది. అయితే 17-11-2025 నాటికి ఈ ఫీజు చెల్లించాలి. ఒకవేళ మిస్ అయితే 29-11-2025 వరకు రూ.200 ఆలస్య రుసుముతో చెల్లించవచ్చు.
అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, ఒరిజనల్ సర్టిఫికేట్స్ జతచేయని అప్లికేషన్స్, టీసీ, మైగ్రేషన్ సర్టిఫికేట్లు లేని ఇతర రాష్ట్రాల్లో ఎస్ఎస్‌సీ చదివిన అభ్యర్థుల అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సరైన పత్రాలు సమర్పించాలని అందులో తెలిపారు.
అర్హతలు నిబంధనలు
పదో తరగతి లేదా సమాన అర్హత పరీక్షలో పాస్ అయి ఏడాది గ్యాప్ ఉన్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఎగ్జామ్స్ 2026కి హాజరు అయ్యేందుకు అర్హులు. అదే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు గ్యాప్ ఉంటే ఫస్ట్, సెకండ్ ఇయర్ ఐపీఈ మార్చి 2026 పరీక్షకు హాజరు అయ్యేందుకు వీలు కల్పించారు.
ఫస్ట్, ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు సెకండ్ లాంగ్వేజ్ అడిషనల్ సబ్జెక్టులో పరీక్షకు హాజరు కావొచ్చు.
అంతేకాదు బైపీసీ గ్రూప్ పాస్ అయిన వారు మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు.
{{/usCountry}}అంతేకాదు బైపీసీ గ్రూప్ పాస్ అయిన వారు మ్యాథమెటిక్స్ అదనపు సబ్జెక్ట్గా ఎంచుకోవచ్చు.
{{/usCountry}}తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల బోర్డు/యూనివర్సిటీలో ఎస్ఎస్‌సీ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తెలంగాణ బోర్డు నుంచి అర్హత సర్టిఫికేట్ పొందాలి. దానికి సంబంధించిన పత్రాన్ని స్కాన్ చేసిన కాపీని హాజరు మినహాయింపు కోసం అప్లై చేస్తున్నప్పుడు అప్‌లోడ్ చేయాలి.
ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షలు రాసే ప్రైవేట్ అభ్యర్థులు రెగ్యులర్ విద్యార్థులకు బోధించిన సిలబస్ మీద పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు tsbie.cgg.gov.inలో లాగిన్ అయి ఎస్ఎస్‌సీ ఒరిజనల్, టీసీ, ఇతర సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించాలి. పోస్టు చేసిన దరఖాస్తును రిజెక్ట్ చేస్తారు.