ఐఆర్‌సీటీసీ హైదరాబాద్, శ్రీశైలం టూర్.. డిసెంబర్ 10న ట్రిప్.. మూడు రోజులు, నాలుగు రాత్రులు!

ఐఆర్‌సీటీసీ టూరిజం బడ్జెట్ ధరలోనే అనేక రకాలైన టూర్ ప్యాకేజీలు అందిస్తోంది. అందులో భాగంగా స్పిరిట్యువల్ తెలంగాణ విత్ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

Published on: Dec 6, 2025, 19:00:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐఆర్‌సీటీసీ టూరిజం అనేక రకాల టూర్ ప్యాకేజీలు అందిస్తుంది. చాలా దూర ప్రాంతాలకే కాదు. హైదరాబాద్ చుట్టు పక్కల, శ్రీశైలం లాంటి క్షేత్రాలకు కూడా ప్యాకేజీలు ఉన్నాయి. బడ్జెట్ ధరలోనే మీరు అన్ని చూసి రావొచ్చు. ఐఆర్‌సీటీసీ స్పిరిట్యువల్ తెలంగాణ విత్ శ్రీశైలం టూర్ ప్యాకేజీని అందిస్తోంది. మెుత్తం మూడు రాత్రులు, నాలుగు రోజులు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ప్రయాణం మెుదలవుతుంది. డిసెంబర్ 10వ తేదీన టూర్ ప్యాకేజీ ఉంది.

శ్రీశైలం టూర్ ప్యాకేజీ
శ్రీశైలం టూర్ ప్యాకేజీ

నాలుగు రోజులు ఇలా

మెుదటి రోజు హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శిస్తారు. హోటల్‌కు తిరిగి వెళ్తారు. హైదరాబాద్‌లో డిన్నర్, రాత్రి బస చేయండి.

రెండో రోజు హైదరాబాద్ - శ్రీశైలం వెళ్తారు. ఉదయం 5 గంటలకు హోటల్ నుండి పికప్ చేసుకుంటారు. శ్రీశైలానికి సుమారు 5 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యలో అల్పాహారం చేస్తారు. మల్లికార్జున స్వామి ఆలయం, పరిసరాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి భోజనం, హైదరాబాద్‌లో బస చేస్తారు.

మూడో రోజు హైదరాబాద్‌లో తిరుగుతారు. హోటల్‌లో అల్పాహారం చేస్తారు. గోల్కొండ కోట, బిర్లా మందిర్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీ దగ్గరకు వెళ్తారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వెళ్లి.. హైదరాబాద్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.

నాలుగో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి.. చెక్ అవుట్ అవుతారు. యాదాద్రికి బయలుదేరుతారు. సురేంద్రపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయాన్ని సందర్శించండి. సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తారు. హైదరాబాద్ / సికింద్రాబాద్ / కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దిగుతారు.

టూర్ ప్యాకేజీ ధర

గ్రూప్ సైట్ 1 టూ 3 ప్యాసింజర్స్ టూర్ ప్యాకేజీ ధరలు చూసుకుంటే.. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19890, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.15010గా ఉంది. పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.9860, బెడ్ లేకుండా కూడా అదే రేట్ ఉంది. 4 టూ 6 ప్యాసింజర్స్ డబుల్ ఆక్యుపెన్సీ రూ.15880, ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ.13500గా ఉండగా పిల్లలకు ఇందులో కూడా రూ.9860 ధర నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్ సందర్శించొచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More