తమిళనాడులోని ఆలయాలను సందర్శించాలనుకునేవారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. అదే టెంపుల్స్ ఆఫ్ తమిళనాడు. ఇందులో మీరు ప్రముఖ ఆలయాలను సందర్శి్స్తారు. తంజావూరు, కుంభకోణం, పుదుచ్చేరి, కాంచీపురం లాంటి ప్రముఖ ప్రదేశాలకు వెళ్తారు. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీ డిసెంబర్ 6వ తేదీన అందుబాటులో ఉంది. ఆరు రాత్రులు, 7 రోజుల టూర్ ఇది.
ఏడు రోజులు ఇలా

మెుదటి రోజు హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం బయల్దేరి తిరుచ్చి వెళ్తారు. తర్వాత హోటల్‌లో చెకిన్ అవుతారు. డిన్నర్ చేసి తిరుచ్చిలోనే స్టే ఉంటుంది.
రెండో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి శ్రీరంగం ఆలయం, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత చెక్ అవుట్ చేసి తంజావూరుకు బయలుదేరుతారు. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించి.. సాయంత్రం కుంభకోణం వెళ్తారు. రాత్రి భోజనం చేసి కుంభకోణంలోనే బస చేస్తారు.
మూడో రోజు హోటల్‌లో అల్పాహారం చేసి ఐరావతేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం, కాశీ విశ్వనాథర్ ఆలయాన్ని సందర్శించండి. డిన్నర్ చేసి నైట్ కుంభకోణంలోనే బస చేస్తారు.
నాలుగో రోజు అల్పాహారం చేసి చెక్ అవుట్ అవుతారు. గంగైకొండ చోళపురం సందర్శిస్తారు. తరువాత చిదంబరం బయలుదేరుతారు. నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత పుదుచ్చేరికి బయలుదేరి వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. డిన్నర్ చేసి పుదుచ్చేరిలో రాత్రి బస ఉంటుంది.
ఐదో రోజు హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత ఆరోవిల్లె సందర్శించాలి. మధ్యాహ్నం పారడైజ్ బీచ్ వెళ్తారు. డిన్నర్ చేసిన తర్వాత రాత్రికి పుదుచ్చేరిలోనే బస చేస్తారు.
ఆరో రోజు అల్పాహారం చేసిన తర్వాత చెక్ అవుట్ చేయాలి. తిరువన్నమలైకి బయలుదేరి వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేయాలి. అరుణాచలం ఆలయాన్ని సందర్శించండి. డిన్నర్ చేసి రాత్రి తిరువన్నమలైలో బస ఉంటుంది.
{{/usCountry}}ఆరో రోజు అల్పాహారం చేసిన తర్వాత చెక్ అవుట్ చేయాలి. తిరువన్నమలైకి బయలుదేరి వెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేయాలి. అరుణాచలం ఆలయాన్ని సందర్శించండి. డిన్నర్ చేసి రాత్రి తిరువన్నమలైలో బస ఉంటుంది.
{{/usCountry}}ఏడో రోజు అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. కాంచీపురం వెళ్తారు. కామాక్షి ఆలయం, కైలాసనాథర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం చెన్నై వెళ్తారు. విమానం ఎక్కి హైదరాబాద్‌కు అర్ధరాత్రికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధరలు
ఐఆర్‌సీటీసీ టెంపుల్స్ ఆప్ తమిళనాడు టూర్ ప్యాకేజీ ధర చూస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.34,600, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.36000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.48750గా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.com సందర్శించవచ్చు.