...
...
Next Story

IRCTC Andaman Tour : హైదరాబాద్ టు అండమాన్..! బడ్జెట్ ధరలో 6 రోజుల టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ..!

హైదరాబాద్ నుంచి అండమాన్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ సమ్మర్ వేళ అక్కడి దీవుల్లో హాయిగా గడుపొచ్చు. మార్చి 30వ తేదీన జర్నీ ఉంటుంది. బడ్జెట్ ధరలోనే ఆపరేట్ చేస్తున్న ఈ ట్రిప్ 6 రోజులు ఉంటుంది.

Published on: Mar 3, 2026, 12:49:19 IST
Advertisement

వేసవి వచ్చేసింది… ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది…! అయితే ఈ వేసవి టైమ్ లో అండమాన్ దీవుల్లో సేద తీరి రావాలనుకునేవారి కోసం IRCTC టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈనెల 30వ తేదీన జర్నీ ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… 6 రోజులు ఉంటుంది.

అండమాన్ (istcok image)
అండమాన్ (istcok image)

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా పలు టూరిస్ట్ చూసి రావొచ్చు. ఫ్లైట్‌లో వెళ్తారు. ఆరు రోజులు, ఐదు రాత్రులు వెళ్లి రావొచ్చు. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం), హవ్‌లాక్, నెయిలీ చుట్టేసి రావొచ్చు. అయితే ముందస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ‘అమెజింగ్ అండమాన్ EX హైదరాబాద్’ పేరుతో టూర్ ప్యాకేజీ పేరుతో అందుబాటులో ఉంటుంది.

టూర్ షెడ్యూల్ ఇలా…

  • మొదటి రోజు : ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరుతారు. పోర్ట్ బ్లెయిర్(శ్రీవిజయపురం) విమానాశ్రయానికి చేరుకుంటారు. లంచ్ చేస్తారు. సెల్యులార్ జైలు, మ్యూజియం సందర్శిస్తారు. ఆ తర్వాత కార్బిన్స్ కోవ్ బీచ్‌ను సందర్శించండి. తరువాత లైట్ అండ్ సౌండ్ షో కోసం సెల్యులార్ జైలుకు వెళ్తారు. రాత్రి పోర్ట్ బ్లెయిర్ లోనే బస చేస్తారు.
  • రెండో రోజు: హావ్‌లాక్ కు చేరుకుంచారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. భోజనం చేస్తారు. రాధానగర్ బీచ్‌ను సందర్శిస్తారు. హావ్‌లాక్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
  • మూడో రోజు : హావ్‌లాక్‌లో హోటల్‌లో అల్పాహారం చేస్తారు. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఎలిఫెంట్ బీచ్‌కు(Elephant Beach) వెళ్తారు. సాయంత్రం హోటల్‌కు తిరిగి వెళ్తారు. హావ్‌లాక్ ద్వీపంలో డిన్నర్, రాత్రి బస చేస్తారు.
  • నాల్గో రోజు: బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత చెక్ అవుట్ అవుతారు. కాలా పత్తర్ బీచ్‌కు వెళ్తారు. తరువాత క్రూయిజ్ సమయాల ప్రకారం నెయిల్ ద్వీపానికి బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం కోసం సీతాపూర్ బీచ్ అండ్ లక్ష్మణ్‌పూర్ బీచ్‌ను సందర్శిస్తారు. Neil Islandలో భోజనం, రాత్రి బస ఉంటుంది.
  • ఐదో రోజు: అల్పాహారం చేసి చెక్ అవుట్ చేస్తారు. భరత్‌ నగర్ బీచ్‌ను చూస్తారు. అనంతరం క్రూయిజ్ సమయాల ప్రకారం పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరుతారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. పోర్ట్ బ్లెయిర్‌లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది.
  • ఆరో రోజు: హోటల్‌లో అల్పాహారం చేస్తారు. తెల్లవారుజామున చెక్ అవుట్ చేసి పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయంలో వెళ్లి హైదరాబాద్ కు విమానం ఎక్కాలి. మధ్యాహ్నం వరకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

టూర్ ప్యాకేజీ ధరలు

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలుంటే bsashidhar5605@irctc.com మెయిల్ ను సంప్రదించవచ్చు. ఇక 8287932229 / 8287932230 ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. నియమ, నిబంధనలు వర్తిస్తాయని అధికారులు పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks