...
...
Next Story

హైదరాబాద్ టు అరుణాచలం...! బడ్జెట్ ధరలో 5 రోజుల IRCTC టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి

ఈ ఫిబ్రవరి నెలలో అరుణాచలం వెళ్తారా..? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యమైన వివరాలను పూర్తి కథనంలో చూడండి…

Published on: Feb 8, 2026, 10:50:16 IST
Advertisement

ఈనెలలో అరుణాచలం వెళ్లే ప్లాన్ ఉందా…? అయితే మీకోసం బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ…5 రోజులు ఉంటుంది. కాచీపురం, అరుణాచలంతో పాటు మరికొన్ని ప్రాంతాలను చూడొచ్చు.

ఈనెలలోనే జర్నీ….

అరుణాచల ఆలయం (image source X)
అరుణాచల ఆలయం (image source X)

హైదరాబాద్ నుంచి అరుణాచలం ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఫిబ్రవరి 20, 2026వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల టూరిస్టులు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మారితే… మరో తేదీలో కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించాలి.

టూర్ ప్యాకేజీలోని వివరాల ప్రకారం…. టికెట్లు బుకింగ్ చేసుకున్నవాళ్లు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లాలి. సాయంత్రం 5 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ 17653) ఉంటుంది. రాత్రి అంతా జర్నీలో ఉంటారు. ఇక రెండో రోజు అంటే పుదిచ్చేరికి ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. ఆ తర్వాత అరోవిల్లే, అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్ ను చూస్తారు. రాత్రి పుదిచ్చేరిలోనే బస ఉంటుంది.

మూడో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత… నేరుగా అరుణాచలం బయలుదేరుతారు. అక్కడ హోటల్‌లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంటారు. రాత్రి తిరువన్నమలైలోనే ఉంటారు. ఇక నాల్గో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత… కాంచీపురానికి బయలుదేరుతారు. అరుణాచలం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కామాక్షి అమ్మన్ టెంపుల్, ఏకాంబరేశ్వర ఆలయం తీసుకెళ్తారు. ఆ తర్వాత అరక్కోణం స్టేషన్ వెళ్తారు. తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. చివరి రోజు ఉదయం 07.50 గంటలకు కాచిగూడకు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

టికెట్ ధరలు ఎంతంటే…?

కంఫర్ట్ 3ఏసీలో ట్విన్ షేరింగ్ కు రూ. 19130, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.14740గా నిర్ణయించారు. చైల్డ్ విత్ బెడ్ రూ.10,700, చైల్డ్ వితౌట్ బెడ్ రూ.8060గా ఉంది. స్టాండర్డ్ క్లాస్ లో ట్విన్ షేరింగ్ కు రూ. 17060, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12670గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు, ఇతర వివరాల కోసం 8287932229 / 8287932228 / 9701360701 మొబైల్ నెంబర్లకు కాల్ చేయవచ్చు. ఈ ప్యాకేజీకి సంబంధించి కొన్ని నియమ, నిబంధనలు కూడా వర్తిస్తాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe