IRCTC : హైదరాబాద్ టు కూర్గ్, మైసూర్ - బడ్జెట్ ధరలో 6 రోజుల ట్రిప్..! ప్యాకేజీ వివరాలివే
హైదరాబాద్ నుంచి కూర్గ్, మైసూర్ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈ మార్చి నెలలోనే జర్నీ ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
సమ్మర్ ఎంట్రీ ఇవ్వటంతో చాలా మంది టూర్లు ప్లాన్ చేస్తుంటారు…! అయితే బడ్జెట్ ధరలోనే ఐఆర్సీటీసీ పలు ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటకలోని మైసూర్, కూర్గ్ ప్రాంతాలను చూపించేందుకు ఓ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… మార్చి 18వ తేదీన అందుబాటులో ఉంది.

'కాఫీ విత్ కర్ణాటక' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో తక్కువ ధరలో కర్ణాటక అందాలను చూడొచ్చు. మార్చి 18వ తేదీన కుదరకపోతే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి… తేదీలను చెక్ చేసుకోవచ్చు. జర్నీ కంటే ముందుగానే టికెట్లను బుకింగ్ చేసుకోవాలి.
కూర్గ్‌లో పచ్చని ప్రకృతి, కాఫీ తోటలు, జలపాతాలను చూడొచ్చు.మైసూర్ రాజభవనాలు, చందనంతో చేసిన కళాఖండాలకు ప్రసిద్ధి. ఈ రెండు ప్రాంతాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
టూర్ షెడ్యూల్ ఇలా….
- మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి రాత్రి 7.05 గంటలకు (కాచిగూడ-మైసూరు ఎక్స్‌ప్రెస్ నెం: 12785) రైలు బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
- 2వ రోజు ఉదయం 9.30 గంటలకు మీరు మైసూరు చేరుకుంటారు. అక్కడి నుంచి కూర్గ్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత అబ్బె జలపాతం, ఓంకారేశ్వర ఆలయాన్ని సందర్శించొచ్చు. రాత్రికి కూర్గ్‌లోనే ఉంటారు.
- 3వ రోజు హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తలకావేరి, భాగమండల, రాజా సీట్ పార్క్‌లను చూస్తారు. ఈ రాత్రి కూడా కూర్గ్‌లోనే బస చేస్తారు.
- 4వ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మైసూర్‌కు బయలుదేరుతారు. దారిలో కావేరి నిసర్గధామ, టిబెటన్ మోనెస్టరీ, బృందావనం గార్డెన్స్‌లను సందర్శిస్తారు. రాత్రికి మైసూర్‌లోనే బస చేస్తారు.
- 5వ రోజు ఉదయం చాముండి హిల్స్, మైసూరు ప్యాలెస్‌లను సందర్శించిన తర్వాత, మధ్యాహ్నానికి రైల్వే స్టేషన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3.15 గంటలకు రైలు మైసూర్ నుంచి కాచిగూడకు బయలుదేరుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- 6వ రోజు ఉదయం 5.40 గంటలకు మీరు కాచిగూడ చేరుకోవడంతో మీ కూర్గ్-మైసూర్ ట్రిప్ కంప్లీట్ అవుతుంది.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే… కంఫర్ట్‌లో (3 ఏసీ )సింగిల్ అక్యుపెన్సీకి రూ. 34900,డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 19980, ముగ్గురు ప్రయాణిస్తే రూ. 15380 అవుతుంది. 5-11 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు బెడ్‌తో సహా రూ. 10930, బెడ్ లేకుండా రూ. 9810చెల్లించాలి. స్టాండర్డ్‌లో (స్లీపర్ బెర్త్) ఒక్కరు ప్రయాణిస్తే రూ. 32880, ఇద్దరు ప్రయాణిస్తే రూ. 17960, ముగ్గురు ప్రయాణిస్తే రూ. 13360 అవుతుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇక్కడే టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 8287932229 / 8287932228 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

