తిరుమల ట్రిప్ ప్లాన్ ఉందా..? తక్కువ ధరతోనే 4 రోజుల టూర్ ప్యాకేజీ, ఈనెలలోనే జర్నీ...!

ఈ ఫిబ్రవరి నెలలో తిరుమల టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ వచ్చేసింది. కాణిపాకంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి….

Published on: Feb 23, 2026, 13:05:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకానికి IRCTC టూరిజం కొత్త టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రిప్ 28 ఫిబ్రవరి 2026వ తేదీన అందుబాటులో ఉంది.

తిరుమల టూర్ ప్యాకేజీ
తిరుమల టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీని “ తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్… నాలుగు రోజులు ఉంటుంది. తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీవారి ఆలయం, శ్రీకాళహస్తి టెంపుల్ ను దర్శించుకోవచ్చు. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.

టూర్ షెడ్యూల్:

  • మొదటి రోజు లింగంపల్లి నుంచి సాయంత్రం 5.30 గంటలకు(ట్రైన్ నెంబర్ 12734) ట్రైన్ బయల్దేరుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ కు సాయంత్రం 6.10 గంటలకు, నల్గొండ స్టేషన్ కు రాత్రి 7.38 గంటలకు రైలు చేరుకుంటుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.
  • ఉదయం 5.55 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. హోటల్ కు చెకిన్ అవుతారు. తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత హోటల్ కి చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే ఉంటారు.
  • తెల్లవారుజామున 2.30 గంటలకు హోటల్ నుంచి బయల్దేరుతారు. తిరుమలకు చేరుకుంటారు. ఉచిత క్యూ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత హోటల్ వద్ద డ్రాప్ చేస్తారు. సాయంత్రం 06.20 గంటల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రైలు (12733 ట్రైన్ నెంబర్ ) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీలో ఉ్ంటారు.
  • నాల్గో రోజు నల్గొండ స్టేషన్ తెల్లవారుజామున 03:04 గంటలకు, సికింద్రాబాద్ స్టేషన్ కు 5:35 గంటలకు, లింగంపల్లి రైల్వే స్టేషన్ కు 6:45 గంటలకు ట్రైన్ చేరుకోవటంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.

తిరుపతి - హైదరాబాద్ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ లో రూ. 13,950, డబుల్ షేరింగ్ కు రూ. 10,860, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 9080గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 12,080, డబుల్ షేరింగ్ కు రూ. 8990, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7210 గా ఉంది. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదించవచ్చు. తిరుమల శ్రీవారి దర్శనం మాత్రం క్యూలైన్ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రత్యేక టికెట్లను అందజేయమని ఐఆర్సీటీసీ టూరిజం స్పష్టం చేసింది. నియమ, నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. https://www.irctctourism.com/ వెబ్ సైట్ ను సంప్రదించి… పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More