తిరుమల : వేసవి రద్దీకి విస్తృత ఏర్పాట్లు - ఈసారి డేటా ఆధారిత ప్రణాళికతో సౌకర్యాలు..!

వేసవి వేళ తిరుమలలో భక్తుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ ముందస్తుగానే చర్యలు చేపట్టే పనిలో పడింది.సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

Published on: Feb 20, 2026, 19:53:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేసవి సెలవుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ నిర్ణయించింది. పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. వేసవి ఏర్పాట్లపై ఇవాళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

తిరుమల (File/PTI)
తిరుమల (File/PTI)

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గత రెండు, మూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషిస్తామన్నారు. దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

విస్తృత ఏర్పాట్లు - టీటీడీ అదనపు ఈవో

భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యంలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్, అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే మజ్జిగ పంపిణీ పాయింట్ల సంఖ్యను పెంచి వేసవిలో భక్తుల దాహార్తిని తీర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు.

వేసవి సెలవుల్లో కుటుంబాలతో కలిసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను మరింత సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచుతామని పేర్కొన్నారు. గంటల వారీగా ఇన్–అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు.

వివిధ కేటగిరీల దర్శనాలను డేటా ఆధారంగా హేతుబద్ధంగా కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లలో భక్తులు వేగంగా దర్శనం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత వేసవిలో జూన్ నెలలో సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామని వెల్లడించారు. అలాగే 2026 జనవరిలో రోజుకు సగటున 74 వేల మందికి పైగా దర్శనం కల్పించినట్లు గుర్తు చేశారు. ఇది సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్, అన్ని విభాగాల సమన్వయంతో సాధ్యమైందని వివరించారు.

వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అదనపు ఈవో ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More