ఐఆర్సీటీసీ టూరిజం నుంచి పలు రకాల ప్యాకేజీలు వస్తున్నాయి. వీటిలో అధ్యాత్మికం, పర్యాటకం వంటి ప్రాంతాలుంటున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా దర్శనంతో పాటు నాసిక్ చూసేందుకు ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది.

3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్ 5 డిసెంబర్, 2025 తేదీన అందుబాటులో ఉంది. సాయి శివమ్ పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
టూర్ షెడ్యూల్ వివరాలు:
- మొదటి రోజు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ నెంబర్ 17064(అజంతా ఎక్స్ ప్రెస్) కలిగిన రైలు ఎక్కాలి. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోడు ఉదయం 7.10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి షిర్డీకి చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీ సాయి బాబా దర్శనం ఉంటుంది. రాత్రి షిర్డీలోనే ఉంటారు.
- మూడో రోజు నాసిక్ చేరుకుంటారు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత పంచాయవతికి వెళ్తారు. సాయంత్రం 8.30 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
- నాల్గో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ ధరలు:
హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే షిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే…. సింగిల్ షేరింగ్ కు రూ. 8,840గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 7470,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7450గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి.
స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే… సింగిల్ షేరింగ్ కు రూ. 7170, డబుల్ షేరింగ్ కు రూ. 5790, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 5770గా నిర్ణయించారు. ఆసక్తిగలవారు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా వివరాలను తెలుసుకోవాలంటే… 04027702407, 9701360701 మొబైల్ నెంబర్లను సంప్రదించవచ్చు.