IRCTC Ooty Tour : ఈ వేసవి వేళ 'ఊటీ' ట్రిప్ - హైదరాబాద్ నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీ, పూర్తి వివరాలు

 ఈ వేసవి వేళ ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ధరతోనే ఊటీతో పాటు కూనూర్‌ చూసి రావొచ్చు.

Published on: Mar 22, 2026, 12:50:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ సమ్మర్ వేళ ఊటీ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ‘అల్టిమేట్ ఊటీ EX హైదరాబాద్ ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.

ఊటీ (Image source Unsplash)
ఊటీ (Image source Unsplash)

ఈ ప్యాకేజీలో భాగంగా ఊటీతో పాటు కూనూర్‌ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 31 మార్చి 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందా లేదా అనేది టూరిజం వెబ్ సైట్ ( https://www.irctctourism.com/ ) లో చూసుకోవాలి.

హైదరాాబాద్ - ఊటీ షెడ్యూల్:

  • తొలి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 02.25 గంటలకు (శబరి ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెంబర్ - 20629) స్టార్ట్ అవుతారు. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.
  • ఉదయం 9.10 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి చేరుకుంటారు. హోటల్‌లోకి చెకిన్ అవుతారు. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి.
  • దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ను సందర్శిస్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి.
  • కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది
  • ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 03.40 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్(రైలు నెంబర్. 20630) ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి.
  • ఉదయం 11.0 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు చూస్తే…. కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33,590గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18,890 ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17170గా నిర్ణయించారు.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 31,050గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16,360, సింగిల్ షేరింగ్ కు రూ. 14,630గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9701360701 నెంబర్లను సంప్రదింవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More