...
...
Next Story

కరీంనగర్ టు తిరుమల..! ఈ నెలలోనే జర్నీ,ఈ IRCTC టూర్ ప్యాకేజీ చూడండి

కరీంనగర్ నుంచి తిరుమల వెళ్లే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం టూర్ ప్యాకేజీ వచ్చేసింది. శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తీని కూడా చూడొచ్చు. ఈనెల 20వ తేదీన జర్నీ ఉంటుంది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..

Published on: Nov 12, 2025, 13:06:38 IST
Advertisement

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ‘తిరుపతి ఫ్రమ్ కరీంనగర్’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాలను చూడొచ్చు.

కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ
కరీంనగర్ - తిరుమల టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీ ప్రస్తుతం 20 నవంబర్, 2025వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ డేట్ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ (https://www.irctctourism.com/ ) లో చూడొచ్చు.

జర్నీ కోసం టికెట్లు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. అయితే కేవలం కరీంనగర్ మాత్రమే కాకుండా… వరంగల్, ఖమ్మం రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు ట్రైన్ ఎక్కొచ్చు.

టూర్ షెడ్యూల్ వివరాలు:

  • కరీంనగర్ నుంచి (ట్రైన్ నెంబర్ 12762) రాత్రి 07.15 గంటలకు రైలు బయల్దేరుతుంది. పెద్దపల్లి స్టేషన్ వద్ద ఎక్కేవారు రాత్రి 8.05 నిమిషాలకు, వరంగల్ వద్ద రాత్రి 9.15, ఖమ్మం స్టేషన్ కు 11 గంటలకు రైలు స్టేషన్ కు చేరుకుంటుంది. రాత్రి మొత్తం జర్నీలో ఉంటారు.
  • రెండో రోజు ఉదయం 7.50 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత.. ఫ్రెషప్ అవుతారు. అక్కడ్నుంచి తిరుచానూరు వెళ్తారు. శ్రీకాళహస్తి దర్శనం ఉంటుంది. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు.
  • తెల్లవారుజామునే తిరుమలకు చేరుకుంటారు. క్యూ లైన్ ద్వారా దర్శనానికి వెళ్తారు. రాత్రి 8.15 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి జర్నీ ఉంటుంది. రాత్రంతా ప్రయాణంలో ఉంటారు.
  • చివరి రోజు తెల్లవారుజాము ఉదయం 03.26 గంటలకు ఖమ్మం, 04.41 గంటలకు వరంగల్, 05.55 గంటలకు పెద్దపల్లి, ఉదయం 08.40 నిమిషాలకు కరీంనగర్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ఇదే ప్యాకేజీ సంబంధించి స్టాండర్ట్ క్లాస్ లో టికెట్ ధరలు చూస్తే…. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7250, డబుల్ షేరింగ్ కు రూ. 9030, సింగిల్ షేరింగ్ కు రూ. 12,120గా నిర్ణయించారు. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవవుతాయి. షరతులు కూడా వర్తిస్తాయి. ఈ ప్యాకేజీకి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదింవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe