కొన్ని రోజులుగా జగిత్యాల జిల్లాలో నడుస్తున్న రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీనియర్ నేత జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన బలంగా జనాల్లోకి వెళ్లింది. మెుదటి నుంచి పార్టీలో ఉన్న తనకు, తన వర్గానికి సరైన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ వర్గంతో వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇక మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానంపై మరింత వివాదం చెలరేగింది.

కాంగ్రెస్ భీ ఫారంపై గెలిచిన కౌన్సిలర్లు, స్వతంత్రులు, ఎంఐఎంతో కలిపి మెుత్తం 23 మందితో ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక క్యాంపు పెట్టారు. మరోవైపు 14 మంది అభ్యర్థులతో జీవన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ పంచాయితీకి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది. జీవన్ రెడ్డి, సంజయ్ వర్గాల మధ్య విభేదాలను పరిష్కరించడానికి కీలక చర్చలు చేశారు. దాదాపు జగిత్యాల ఎపిసోడ్ ఫైనల్‌కు వచ్చినట్టే కనిపిస్తోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో ఏఐసీసీ సెక్రటరీ సవాంగ్ విడివిడిగా సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న జీవన్ రెడ్డి.. ప్రజా భవన్‌లో సవాంగ్‌ను కలిశారు. పార్టీ అంతర్గత విషయాలను రోడ్డుపైకి తీసుకురావడంతో కేడర్‌లో అయోమయం ఉందని ఇరువురి నేతలను హెచ్చరించినట్టుగా సమాచారం. పార్టీ తీసుకునే నిర్ణయానికి ఇద్దరు నేతలు కట్టుబడి ఉండాలన్నారు.
పార్టీ కోసం కష్టపడేవారికే.. మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవి ఇవ్వాలని నేతలు నిర్ణయించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సంజయ్ కుమార్, ఆయన వర్గం కూడా సర్దుకుపోయేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు నేతలు ఇద్దరూ.. కలిసి పని చేస్తామని హామీ ఇచ్చారట. విధేయతకే పెద్దపీట వేయాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రెండు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెుదటిది ఛైర్ పర్సన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి జీవన్ వర్గానికి. అయితే రెండో ప్రతిపాదన ఏంటంటే.. చెరో రెండున్నర సంవత్సరాలు ఛైర్ పర్సన్ పీఠం పంచుకునేలా సూచించారు. జీవన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్ పర్సన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలన్నారు.
{{/usCountry}}కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య రెండు ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మెుదటిది ఛైర్ పర్సన్ పీఠం సంజయ్ వర్గానికి, వైస్ ఛైర్మన్ పదవి జీవన్ వర్గానికి. అయితే రెండో ప్రతిపాదన ఏంటంటే.. చెరో రెండున్నర సంవత్సరాలు ఛైర్ పర్సన్ పీఠం పంచుకునేలా సూచించారు. జీవన్ రెడ్డి మాత్రం.. కాంగ్రెస్ జెండా మోసిన వారికే ఛైర్ పర్సన్ పీఠం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వర్గంతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలన్నారు.
{{/usCountry}}'కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా.. కట్టుబడి ఉంటాను. పార్టీ జెండా మోసినవారికే పదవులు ఇవ్వాలని బలంగా అనుకునే వ్యక్తిని నేను. నా అభిప్రాయాలు, సూచనలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పాను.' అని జీవన్ రెడ్డి మాట్లాడారు.